E-Paper
Advertisement

Taraka Ratna: తిరిగిరాని లోకాలకు తారకరత్న.. ఇదీ ఆయన ప్రస్థానం..

Taraka Ratna: తిరిగిరాని లోకాలకు తారకరత్న.. ఇదీ ఆయన ప్రస్థానం..
Advertisement

Taraka Ratna: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారకరత్న కన్నుమూశారు. యువగళం పాదయత్రలో తీవ్ర గుండెపోటుతో అస్వస్థతకు గురైన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

దివంగత నటుడు ఎన్టీఆర్ కుమారుడు మోహన్‌కృష్ణ తనయుడైన తారకరత్న 1983 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇరవైయేళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 2002లో విడుదలైన ఒకటో నెంబర్ కుర్రాడుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే ఘన విజయం సాధించడంతో ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. యువరత్న, భద్రాద్రి రాముడు, అమరావతి, నందీశ్వరుడు వంటి హిట్ సినిమాల్లో తారకరత్న నటించారు. హీరోగానే కాకుండా విలన్, సహాయక నటుడిగానూ నటించి ప్రేక్షకులను అలరించారు.

Advertisement

తారకరత్న 2012లో అలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. స్నేహితుల ద్వారా వారిద్దరికి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే ముందుగా ఇరువురి కుటుంబాల్లో వారిప్రేమను ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారిని ఇరుకుంటుంబాలు చేరదీశాయి. ఈ దంపతులకు నిష్కా అనే కూతురు ఉంది. అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా తారకరత్న చురుగ్గా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొని.. ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.

ఇక రానున్న ఎలక్షన్లలో తారకరత్న రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి నారా లోకేష్ నుంచి తారకరత్న హామీ తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది. కానీ తారకరత్న తన చివరి కోరిక తీరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

Advertisement

Telugu Film Producers Council: నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర్‌ ప్రసాద్‌ గెలుపు..

Taraka Ratna : తారకరత్న లక్ష్యాలు అవే…. ఆ రెండు కోరికలు తీరకుండానే..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×