E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram: నాని ‘గరం గరం’ సాంగ్ అదుర్స్.. మాస్ యాక్షన్‌తో దుమ్ముదులిపేశాడు

Saripodhaa Sanivaaram: నాని ‘గరం గరం’ సాంగ్ అదుర్స్.. మాస్ యాక్షన్‌తో దుమ్ముదులిపేశాడు
Advertisement

Nani Saripodhaa Sanivaaram First Single: నాచురల్ స్టార్ నాని గతేడాది బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. అదే జోష్‌లో మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అందులో ‘సరిపోదా శనివారం’ మూవీ ఒకటి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో నానికి జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే ఇందులో కోలీవుడ్ స్టార్ నటుడు, డైరెక్టర్ ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినీ ప్రియుల్లో ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో నాని మాస్ అండ్ రగ్గడ్‌ లుక్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. అంతేకాకుండా యాక్షన్ సీన్లు కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది.

Advertisement

Also Read: హ్యాపీ బర్త్ డే బ్రదర్.. సరిపోదా శనివారం గ్లింప్స్ అదిరిపోయింది

ఈ గ్లింప్స్‌కు యూట్యూబ్‌లో సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినీ ప్రియులు ఈ మూవీ నుంచి మరికొన్ని అప్డేట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా అదిరిపోయే ట్రీట్ అందించారు. ఇందులో భాగంగా ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘గరం గరం’ అంటూ సాగే ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. ఈ సాంగ్‌లో నాని యాక్షన్ సీన్లు అభిమానుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

Advertisement

కాగా ఈ మూవీలో నాని ‘సూర్య’ అనే పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ మూవీ టైటిల్‌కు అర్థం ఏంటంటే.. వారమంతా సహనంగా ఉండి ఒక్క శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించే ఒక డిఫిరెంట్ క్యారెక్టర్. ఇందులో నాని పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×