BigTV English

NZ vs UGA Highlights, T20 World Cup 2024: పసికూన ఉగండాపై.. 5.2 ఓవర్లలో కివీస్ ఘనవిజయం

NZ vs UGA Highlights, T20 World Cup 2024: పసికూన ఉగండాపై.. 5.2 ఓవర్లలో కివీస్ ఘనవిజయం

New Zealand vs Uganda Highlights T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో మరో సంచలనం నమోదైంది. ఉగాండాతో జరిగిన గ్రూప్ సి మ్యాచ్ లో కివీస్ అద్భుతంగా ఆడి 5.2 ఓవర్లలో విజయం సాధించింది. అయితే ఎంత గొప్పగా ఆడినా సూపర్ 8కి అర్హత సాధించలేకపోయింది. ఏదో కంటితుడుపు మ్యాచ్ గా మిగిలిపోయింది.


టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన ఉగండా 18.4 ఓవర్లు ఆడి 40 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ 5.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసి జయభేరి మోగించింది.

వివరాల్లోకి వెళితే..  41 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ (9) త్వరగా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డేవన్ కాన్వే 15 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి సపోర్ట్ గా రచిన్ రవీంద్ర (1) ఉన్నాడు. మొత్తానికి 5.2 ఓవర్లలో 41 పరుగులు చేసి కివీస్ విజయం సాధించింది.


Also Read: వరుణుడి ఆటంకం?.. నేడు కెనడాతో టీమ్ ఇండియా మ్యాచ్

ఉగండా బౌలింగులో రియాజత్ ఆలి షా 1 వికెట్ తీశాడు.

అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన ఉగండా చాలా ఓపికగా వికెట్లు పడకూడదనే లక్ష్యంతో ఆడింది. అలా 18.4 ఓవర్లు నిలిచింది. కేవలం పెద్ద జట్లపై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో ఆడినట్టుగానే కనిపించింది. అయితే ఇందులో ఒకే ఒక్కడు కెన్నెత్ వైశ్వా (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. ఇందులో నలుగురు డక్ అవుట్లు అయ్యారు. ఇద్దరు 2 పరుగులు చొప్పున చేశారు. ఒకరు మూడు, ఒకరు నాలుగు పరుగులు చేశారు. అలా 18.4 ఓవర్లు ఆడి అతికష్టమ్మీద 40 పరుగులు చేశారు.

కివీస్ బౌలింగులో ట్రెంట్ బౌల్ట్ 2, టిమ్ సౌథీ 3, మిచెల్ సాంట్నర్ 2, పెర్గ్యూసన్ 1, రచిన్ రవీంద్ర 2 వికెట్లు తీశారు.

Related News

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Big Stories

×