BigTV English

Nani: అంత వయోలెన్స్ ఉంటే కోర్టుకి వెళ్లాల్సిందే నాని…

Nani: అంత వయోలెన్స్ ఉంటే కోర్టుకి వెళ్లాల్సిందే నాని…

Nani: నేచురల్ స్టార్ నాని స్క్రిప్ట్ సెలక్షన్ పైన ఉన్న నమ్మకం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. ఈ ఒక్క నమ్మకమే నాని ఏ సినిమా చేసినా, ఏ డైరెక్టర్ తో చేసినా ప్రేక్షకులని మెప్పిస్తుంది. హీరోగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా హిట్స్ కొడుతున్న నాని, లేటెస్ట్ గా కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు, ప్రియదర్శి హీరోగా తెరకెక్కించిన కోర్ట్ సినిమాకి అనౌన్స్ చేసినప్పటి నుంచే సౌండ్ చేయడానికి రీజన్, ఈ ప్రాజెక్ట్ ని నాని ప్రొడ్యూస్ చేస్తుండడమే…


నానికి ఆడియన్స్ లో ఉన్న క్రెడిబిలిటీ కోర్ట్ సినిమాని సక్సస్ వైపు నడిపిస్తుంది. కలెక్షన్స్ తో పాటు క్రిటిక్స్ ని కూడా మెప్పించిన ఈ మూవీ సక్సస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఇందులో నాని మాట్లాడుతూ కోర్ట్ సినిమా మా నమ్మకాన్ని నిలబెట్టిందని చెప్పాడు. కోర్ట్ సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తే అది పాన్ ఇండియా మూవీ అవుతుంది, ఆ రేంజ్ సక్సస్ ని సొంతం చేసుకున్న కోర్ట్ సినిమాకి సీక్వెల్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే కాదు. నాని చెప్పినట్లు కోర్ట్ 2 అనౌన్స్మెంట్ నుంచే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవ్వడం గ్యారెంటీ.

కోర్ట్ సక్సస్ మీట్ లో స్టేజ్ ఎక్కి డాన్స్ కూడా వేసిన నాని… ఫాన్స్ కి కిక్ ఇచ్చే విషయాన్ని రివీల్ చేసాడు. నాని ప్రొడ్యూసర్ గా “హిట్ ఫ్రాంచైజ్” నుంచి ఇప్పటికే రెండు పార్ట్స్ వచ్చి హిట్ అయ్యాయి. మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్ లో అడవి శేష్ నటించగా… ఇప్పుడు థర్డ్ పార్ట్ లో నాని నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో నాని… అర్జున్ సర్కార్ గా ఫాన్స్ లో ఫుల్ జోష్ నింపాడు.


లేటెస్ట్ గా హిట్ ఫ్రాంచైజ్ కి, కోర్ట్ ఫ్రాంచైజ్ ని కలిపితే బాగుంటుందని నాని స్టేజ్ పైన మాట్లాడడం విశేషం. రెండు ఫ్రాంచైజ్ లకి నానినే ప్రొడ్యూసర్ కాబట్టి “హిట్ X కోర్ట్” కాంబినేషన్ ని సెట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. వయోలెన్స్ ఎక్కువగా చేసే అర్జున్ సర్కార్ ని కోర్ట్ మెట్లు ఎక్కిస్తే చాలు సాలిడ్ డ్రామా సెట్ అయిపోయినట్లే. అయితే హిట్ ఫ్రాంచైజ్ కి శైలేష్ కొలను దర్శకుడు, కోర్ట్ సినిమాకి రామ్ జగదీష్ దర్శకుడు… ఒకవేళ రెండు ఫ్రాంచైజ్ లని కలపాల్సి వస్తే ఆ ప్రాజెక్ట్ ని ఇద్దరు దర్శకుల్లో ఎవరు తెరకేక్కిస్తారు అనేది ఇంటరెస్టింగ్ విషయం. ఎవరు డైరెక్ట్ చేసినా ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ నానినే అవుతాడు కాబట్టి ఆడియన్స్ అయితే థియేటర్స్ కి వస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది? ఎవరు డైరెక్టర్ చేస్తారు? అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×