BigTV English

Zaheer Khan: జహీర్ ఖాన్‌కు ‘ఐ లవ్ యూ’… 20 ఏళ్ల తర్వాత !

Zaheer Khan: జహీర్ ఖాన్‌కు ‘ఐ లవ్ యూ’… 20 ఏళ్ల తర్వాత  !

Zaheer Khan: భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకరు. భారత క్రికెట్ కి జహీర్ ఖాన్ చేసిన సేవ అంత సులభంగా ఎవరూ మరిచిపోరు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో చాలా రికార్డులు జహీర్ ఖాన్ పేరు మీద ఉన్నాయి. కొన్ని రికార్డులు అయితే ఎప్పటికీ చెక్కుచెదరవు. జహీర్ ఖాన్ మిలీనియంలో అరంగేట్రం చేసిన అనధికాలంలోనే భారత ప్రధాన బౌలర్ గా ఎదిగాడు. లెఫ్ట్ ఆర్మీ బౌలింగ్ తో ఎన్నో మ్యాచ్లలో భారత విజయానికి కారణమయ్యాడు.


Also Read: IPL Controversies: శ్రీశాంత్ చెంపదెబ్బ నుంచి కోహ్లీ-గంభీర్ వరకు.. ఐపీఎల్ పంచాయితీలు ఇవే !​

జహీర్ తన కెరీర్ లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడాడు. ఇందులో టెస్టుల్లో 311 వికెట్లు, వన్డేలో 282 వికెట్లు, టి-20లో 17 వికెట్లు తీశాడు. అయితే 20 సంవత్సరాల క్రితం జహీర్ ఖాన్ కి ఓ అమ్మాయి మైదానంలో లవ్ ప్రపోజ్ చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. 2005 మార్చి 24న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ – పాకిస్తాన్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరిగింది.


ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 570 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించింది భారత్. ఆ సమయంలో ఒక మహిళ అభిమాని చిన్నస్వామి స్టేడియంలో “జహీర్ ఐ లవ్ యు” అని రాసి ఉన్న ప్లాకార్డును పట్టుకొని కనిపించింది. ఇంతలో కెమెరామెన్ కళ్ళు ఆ ఫ్లకార్డు పట్టుకొని కూర్చున్న యువతిపై పడ్డాయి. అనంతరం కెమెరామెన్ పదేపదే ఇటు జహీర్ ఖాన్ ని, అటు ఆ యువతని పదేపదే చూపించాడు.

ఇంతలో ఆ యువతి ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో యువరాజ్ సింగ్.. జహీర్ ఖాన్ స్పందన కోరుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత జహీర్ ఖాన్ కూడా ఆమెకి ఫ్లయింగ్ ఇచ్చాడు. దీంతో అమ్మాయి సిగ్గు పడుతూ ప్లకార్డుని అడ్డుగా పెట్టుకుంది. దీంతో యువరాజ్ సింగ్ వెంటనే జహీర్ ఖాన్ ని ఆట పట్టించాడు. అదే సమయంలో బ్యాటింగ్ చేస్తున్న వీరేంద్ర సెహ్వగ్ కూడా ఇదంతా చూసి కాసేపు నవ్వుకున్నాడు. అయితే తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీన్ ని రీ క్రియేట్ చేసింది.

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో లక్నో మెంటార్ గా జట్టుతో కలిసి ఎందుకు వచ్చాడు జహీర్ ఖాన్. ఈ క్రమంలో జహీర్ కి 20 ఏళ్ల క్రితం ప్రపోజ్ చేసిన అభిమానితో స్వాగతం పలికించింది. ఆమె మరోసారి “జహీర్ ఐ లవ్ యు” అనే ప్లకార్డుని ప్రదర్శించింది. ఈ సన్నివేశాన్ని లక్నో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన అభిమానులు 20 సంవత్సరాలు అయినా జహీర్ ఖాన్ పై ఆమె ప్రేమ చెక్కుచెదరలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక జహీర్ ఖాన్.. సాగరిక ఘట్కే అనే అమ్మాయిని 2017లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×