E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram : సరిపోదా శనివారం..హై ఓల్టేజ్ యాక్షన్.. గ్లింప్స్ అదుర్స్.

Saripodhaa Sanivaaram : సరిపోదా శనివారం..హై ఓల్టేజ్ యాక్షన్.. గ్లింప్స్ అదుర్స్.
Advertisement
Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram : మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. ఇది అందరూ చెప్పే లైఫ్ కోట్. అయితే దీన్నే కాన్సెప్ట్ గా తీసుకొని నాని కొత్త సినిమాతో మనం ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఒక విలక్షణమైన నటుడిగా ఎదిగాడు నాచురల్ స్టార్ నాని. తన ఇమేజ్ కు తగ్గట్టే మంచి పాత్రలు చేయడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యే సినిమాలతో ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు.

ఒకపక్క క్లాస్ మరోపక్క మాస్ సమానంగా బ్యాలెన్స్ చేసే నాని,మొన్న దసరా మూవీతో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. హాయ్ నాన్న మూవీతో తండ్రి కూతుర్ల అనుబంధాన్ని అందంగా తెరపై ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, గ్లింప్స్ ఎమోషనల్ గా అందర్నీ రీచ్ అయ్యాయి. ఈ మూవీలో టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ విడుదల కాబోతున్న ఈ చిత్రంతో నాని మంచి కమర్షియల్ హిట్ అందుకుంటాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

Advertisement

తాజాగా సుందరానికి మూవీ డైరెక్టర్ వివేకాత్రేయ తిరిగి నానితో జతకట్టాడు. దసరా పండుగ సందర్బంగా చిత్ర బృందం ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ విడుదల చేశారు. ఈ మూవీకి వెరైటీగా ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ తోపాటు గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. 2.48 నిమిషాల నిడివితో సాగే ఈ గ్లింప్స్ వీడియో చిత్రంపై ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది. ఫస్ట్ పోస్టర్ ,గ్లింప్స్ తోటే నాని మూవీపై పాజిటివ్ బజ్ సృష్టించాడు.

ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.. రాజుకైనా, బంటుకైన తనకంటూ ఒకరోజు వస్తుంది.. ఆ రోజు కోసం ఎదురు చూడాలి.. అంటూ సాయి కుమార్ బేస్ వాయిస్ తో స్టార్ట్ అయ్యే వీడియో మొదట్లోనే గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. ఒక షెడ్ లో గొలుసులతో బందీగా ఉన్న ఒక వ్యక్తి విడిపించుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. చుట్టూ మంటలు ..షెడ్డు మొత్తం తగలబడి పోతూ ఉంటుంది. ఇంతలో ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న ఇనుప గొలుసుతో విసిరి ఒక కత్తిపీఠను లాగుతాడు.. ఆ కత్తిపీఠ సహాయంతో తన చేతికున్న బంధనాలను తెంపుకుంటాడు. పైకి లేచిన ఆ వ్యక్తి మంట వెలుగులో హీరో నాని అని మనం గుర్తిస్తాం.

Advertisement

సరిగ్గా అదే టైం గాల్లో ఎగురుతూ తన వైపు వస్తున్న ఒక సగం మండుతున్న పేపర్ ను నాని చేత్తో ఆపుతాడు. దానిపై శనివారం అని రాసి ఉంటుంది. ఇలా వీడియో తోటే నాని క్యారెక్టర్ ను సూపర్ గా ఎలివేట్ చేశాడు డైరెక్టర్. ఇంతకీ శనివారం సంగతి ఏంటి.. సరిపోదా శనివారం అనే టైటిల్ ఈ మూవీకి ఎందుకు ఇచ్చారు. తెలియాలి అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. టైటిలే వెరైటీగా ఉంటుంది అనుకుంటే వీడియో అంతకంటే ఎక్సైటింగ్ గా ఉంది. మరి మూవీ ఇంకెంత వెరైటీగా ఉంటుందో అని నాని ఫాన్స్ ఎగ్జిట్ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×