E-Paper
Advertisement

తెరపైకి శాండ్ పేపర్ వివాదం..బౌండరీ లైన్ దగ్గర నాథన్ లైయన్ ఆడుకున్న ఫ్యాన్స్

తెరపైకి శాండ్ పేపర్ వివాదం..బౌండరీ లైన్ దగ్గర నాథన్ లైయన్ ఆడుకున్న ఫ్యాన్స్
Advertisement

South Africa Fan Offers Sandpaper To Nathan Lyon: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ ప్రారంభం కాకముందు నుంచే శాండ్ పేపర్ వివాదం కంగారులను కంగారెత్తించింది. ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, సౌతాఫ్రికా మీడియా కూడా శాండ్ పేపర్ పై చాలా రకాల కథనాలు వచ్చాయి. ఇక తాజాగా ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్ట్ జరుగుతుండగా కంగారులను సౌతాఫ్రికా ఫ్యాన్స్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బౌండరీ లైన్ దగ్గర ఉన్న ఆస్ట్రేలియా ప్లేయర్ నాథన్ లైయన్ ను పిలిచి, నీకు శాండ్ పేపర్ కావాలా ? అంటూ ఓ సౌతాఫ్రికా ఫ్యాన్ అవమానించాడు. అది గమనించిన మిగతా అభిమానులు…వికెట్లు పడకపోతే, తమ దగ్గర ఉన్న శాండ్ పేపర్ తీసుకుని వాడండి అంటూ  ఓవరాక్షన్ చేశారు. ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ ను పదే పదే పిలిచి ఇబ్బంది పెట్టారు. సౌతాఫ్రికా అభిమానులు చేసే టార్చర్ భరించలేక నాథన్ తల దించుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన మూడో టెస్ట్ రెండో రోజు సందర్భంగా జరుగగా వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఆస్ట్రేలియా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఒకరు, ఇద్దరు చేసిన తప్పిదానికి మిగతా ప్లేయర్లను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

అసలు శాండ్ పేపర్ వివాదం ఏంటి ?

Advertisement

శాండ్ పేపర్ వివాదం క్రికెట్ చరిత్రలోనే పెద్ద వివాదం. శాండ్ పేపర్ అంటే బాల్ టాంపరింగే. బంతిని ఉప్పు కాగితంతో రుద్దడంతో శాండ్ పేపర్ వివాదంగా పిలుస్తున్నారు. ఈ సంఘటన 2018 మార్చిలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో వికెట్లు పడాలని ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరాన్ బాన్ క్రాఫ్ట్ పసుపు రంగు కాగితంతో ( ఉప్పు కాగితం) బంతిని రుద్దాడు. ఈ క్రమంలోనే అంపైర్లకు రెడ్ హ్యాండెడ్ గా బాన్ క్రాఫ్ట్ పట్టుబడ్డాడు. ఈ బాల్ టాంపరింగ్ సూత్రధారి డేవిడ్ వార్నర్ కాగా, కెప్టెన్ హోదాలో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా ఇరుక్కుపోయాడు. దీంతో ఈ ముగ్గురిపైన వేటు పడింది. అప్పటి నుంచి శాండ్ పేపర్ వివాదం ఆస్ట్రేలియా ప్లేయర్లను వేధిస్తోంది.

మూడో టెస్టులో ఆస్ట్రేలియా దూకుడు

ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ప్రస్తుతం కేప్ టౌన్ వేదికగా మూడో టెస్టు కొనసాగుతోంది. ఇందులో మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 329 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఈ తరుణంలోనే రెండో రోజు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 330 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా ఒక పరుగు లీడ్ కూడా సాధించింది.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

 

Related News

సంజీవ్ గోయెంకాకు బుర్రే లేదు..కెప్టెన్సీ పీకేసి ధోనిని అవమానించాడు!

న్యూజిలాండ్, టీమిండియా సిరీస్ పై ICC వెంట‌నే విచార‌ణ చేయాలి!

డారిల్ మిచెల్ గుండు నుంచి పొగ‌లు.. పొయ్యిలో కూర్చున్నాడా ఏంటి?

అభిషేక్‌-వైభ‌వ్ కంటే బాబ‌ర్‌-రిజ్వానే రియ‌ల్ హీరోలు

సానియా మీర్జా సంచ‌ల‌న నిర్ణ‌యం…మసీదు కోసం స్థ‌లం విరాళం ?

అభిషేక్ బ్యాటింగ్ త‌ల‌చుకుని, న్యూజిలాండ్ బౌల‌ర్లు నిద్ర‌లోనూ ఉలిక్కిప‌డ‌తారు

టీమిండియాలో అంద‌రూ రాక్ష‌సులే…వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతోంది

Big Stories

Advertisement
×