BigTV English

Launcher-Hamas : జనావాసాల మధ్యే హమాస్ లాంచర్లు.. వ్యూహం ఇదేనా..?

Launcher-Hamas : జనావాసాల మధ్యే హమాస్ లాంచర్లు.. వ్యూహం ఇదేనా..?
Launcher-Hamas

Launcher-Hamas : పౌరులు, జనావాసాలను రక్షణ కవచంగా చేసుకుని హమాస్ దాడులు సాగిస్తున్న వైనాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) బయటపెట్టాయి. గాజాలోని ఐక్యరాజ్యసమితి భవనం, కిండర్ గార్టెన్, మసీదు మధ్య రాకెట్ లాంచర్లను ఏర్పాటు చేయడాన్ని ఆధారాలతో సహా రట్టు చేసింది.


ఏరియల్ ఫొటోలను గమనిస్తే.. స్కూళ్ల వద్దే రాకెట్ లాంచ్ సైట్ ఉండటం గమనించొచ్చు. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిలో 1400 ఇజ్రాయెలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జనావాసాల మధ్య నుంచే 7 వేల రాకెట్లను ఇజ్రాయెల్ వైపు పేల్చింది. వీటిలో గురి తప్పిన 550 రాకెట్లు గాజాపైనే పడ్డాయి.

వారం రోజుల క్రితం అలా ఓ రాకెట్ అక్కడి ఆస్పత్రిపైనే పడింది. అహ్లీ అరబ్ ఆస్పత్రి పార్కింగ్ ఏరియాలో పడటంతో పెద్ద పేలుడు సంభవించింది. అది ఇజ్రాయెల్ పనేనంటూ హమాస్ ఆరోపించింది. అయితే హమాస్ ప్రయోగించిన రాకెట్ గురి తప్పడంలో వల్లే ఆ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు ఇజ్రాయెల్, అమెరికా, యూరోప్, కెనడా నిఘా వర్గాలు ధ్రువీకరించాయి.


పౌరులను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుని ఇజ్రాయెల్‌పై దాడులు చేయొచ్చనేది హమాస్ అనుసరిస్తున్న వ్యూహం. ఈ కారణంగానే గాజాను పౌరులు ఖాళీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×