E-Paper
Advertisement

Prathinidhi 2 Trailer: నేటి రాజకీయ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించిన ప్రతినిధి..

Prathinidhi 2 Trailer: నేటి రాజకీయ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించిన ప్రతినిధి..
Advertisement

Prathinidhi 2 Trailer: కుర్ర హీరో నారా రోహిత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ప్రతినిధి ఒకటి. ఈ సినిమా కలక్షన్స్ అందుకోవడంలో విఫలమయినా.. కథ పరంగా ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఇక ఇన్నాళ్ల తరువాత నారా రోహిత్ ఈ సినిమాకు సీక్వెల్ తో వస్తున్నాడు. అదే ప్రతినిధి 2. మూర్తీ దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ బ్యానర్స్ పై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ మొత్తం పొలిటికల్ సెటైర్ గా కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ” మన స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పుడు గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు.. ? ఎంతమంది గుండెపోటుతో చచ్చారు” అనే పవర్ ఫుల్ డైలాగ్ నారా రోహిత్ చెప్పడంతో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో నారా రోహిత్ న్యూస్ యాంకర్ గా కనిపించాడు. అవినీతి రాజకీయ నాయకులను చెమటలు పట్టించే ప్రశ్నలు అడిగి వారికి గుండెపోటు వచ్చేలా చేశాడు. ఇక నాయకుల కోసం ప్రజలు ఎందుకు చనిపోతున్నారు.. ? అనే దానిమీద కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఒక నాయకుడుకు ఏదైనా జరిగిందని తెలియగానే ప్రజలు సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు అని నారా రోహిత్ ఒక వ్యక్తిని అడుగుతాడు. అతను.. ఆయన మా దేవుడు సర్.. ఆయనకు ఇలా అయ్యిందని తెలియగానే అని ఏదో చెప్పేలోపు.. నమ్ముకున్న నీ భార్యాపిల్లల కంటే.. నాలుగు పథకాలు ఇచ్చిన నీ నాయకుడు ఎక్కువ అయ్యాడా.. ? అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక అందరి రాజకీయ నాయకుల గుట్టు బయటపెట్టడానికి న్యూస్ రిపోర్టర్ అయిన హీరో ఏం చేశాడు.. ? ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు.. ? అనేది ఇందులో చూపించారు. ఇక ఈ చిత్రంలో క్యాస్టింగ్ కూడా పెద్దగానే ఉంది. సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేదేహర్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘు బాబు రఘు కారుమంచి లాంటి వారందరూ నటించారు. ఏప్రిల్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఈ ఎన్నికల వేళ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×