
Rashmika Mandanna’s Deep Fake Video: పుష్ప చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

ఇటీవల యానిమల్ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అయితే గతంలో డీప్ ఫేక్ వీడియో బారిన పడింది ఈ బ్యూటీ.

అందులో ఓ యువతి లిఫ్ట్‌లో ఉన్న ఫేస్‌కి రష్మిక ఫొటోను యాడ్ చేశారు.

అయితే ఈ అందాల భామ మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.

ఇందులోనూ సేమ్ అదే తీరుగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ ఉపయోగించి ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేశారు.

గతం కంటే ఈసారి ఇంకా క్లియర్ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు.

ఇందులో ఓ యువతి డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

దీనికి రష్మిక ముఖాన్ని ఎడిట్ చేశారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

దీనిపై పలువురు వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో చేయవద్దు అంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.