Nayanthara: నయనతార కుటుంబంపై ఛీటింగ్ కేసు.. ఆయన చేసిన పని వల్ల..!

Nayanthara: నయనతార కుటుంబంపై ఛీటింగ్ కేసు.. ఆయన చేసిన పని వల్ల..!

Nayanthara: నయనతార కుటుంబంపై ఛీటింగ్ కేసు.. ఆయన చేసిన పని వల్ల..!
Share this post with your friends

Nayanthara: అనుకోకుండా చేసే తప్పులు ఒక్కొక్కసారి సినీ సెలబ్రిటీలను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తాయి. సెలబ్రిటీలు మాత్రమే కాదు.. వారి కుటుంబాలు కూడా పలు విషయాల్లో అత్యంత జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. లేకపోతే అనుకోని చిక్కులు ఎదురవుతాయి. దానికి విఘ్నేశ్ శివన్ తండ్రే ఉదాహరణ. ఈ డైరెక్టర్ తండ్రి చేసిన పనికి కుటుంబం మొత్తంపై ఛీటింగ్ కేసు నమోదయ్యింది. ఈ ఛీటింగ్ కేసులో నయనతార పేరు కూడా నమోదు అయ్యింది…

కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార, విఘ్నేశ్ శివన్. ఇప్పుడు ఈ స్టార్ కపుల్‌పై ఛీటింగ్ కేసు నమోదవ్వడం వారి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విఘ్నేశ్ తండ్రి శివకొలుందు తమను మోసం చేశాడంటూ ఆయన సోదరులు కేసు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు శివకొలుందుతో పాటు తన మొత్తం కుటుంబంపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది.

విఘ్నేశ్ శివన్ తండ్రి తిరుచ్చిలోని లాల్‌గుడి అనే ప్రాంతానికి చెందినవారు. ఇప్పటికీ శివకొలుందు, ఆయన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నారు. వీరికి ఆ గ్రామంలోనే కొంత పూర్వీకులకు సంబంధించిన ఆస్తి ఉంది. ఇది శివకొలుందుతో పాటు తన సోదరులు కుంజితపాదం, మాణిక్యం పేర్ల మీద కూడా ఉంది. కానీ వారికి తెలియకుండా శివకొలుందు ఆ ఆస్తిని కాజేసి, వేరే వాళ్లకు అమ్మేశాడని సోదరులు పోలీసులను ఆశ్రయించారు.

శివకొలుందు చేసిన పనికి ఆయన భార్య మీనాకుమారీ, కుమారుడు విఘ్నేశ్ శివ్, కోడలు నయనతార, కూతురు ఐశ్వర్యలపై కూడా కేసు నమోదు చేశారు లాల్‌గుడి పోలీసులు. ఈ సమస్యల మధ్యలో శివకొలుందు సోదరుడి భార్య.. తనకు గుండె సంబంధిత వ్యాధి ఉందని ఆపరేషన్‌కు డబ్బులు కావాలంటూ మీడియా ముందుకు వచ్చింది. త్వరలో ఆపరేషన్ చేయించుకోకపోతే తన ప్రాణాలు పోతాయని వాపోతోంది. అందుకే త్వరగా ఈ కేసును తేల్చి తమ వాటా తమకు ఇవ్వాలని వేడుకుంటోంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Bed : మంచం మీద కూర్చుని ఆ రెండు పనులు చేస్తున్నారా…

BigTv Desk

 Anasuya Bharadwaj : పవర్ స్టార్ మూవీకి నో అన్న రంగమ్మ అత్త.. రీజన్ అదే

Bigtv Digital

KCR BRS: విభజనవాదికి ఏపీలో ఆదరణ దక్కేనా? గతాన్ని మరిచి బీఆర్ఎస్ తో కలిసొచ్చేనా?

BigTv Desk

Gold Rates : గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..

Bigtv Digital

Chiranjeevi:- డా.బ్రహ్మానందంను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్

Bigtv Digital

Meta : మెటా ఉద్యోగులకు షాక్‌.. మార్క్ జుకర్ బర్గ్ కీలక నిర్ణయం

BigTv Desk

Leave a Comment