
Threads App latest news(Celebrity News Today): ఈరోజుల్లో సోషల్ మీడియా యాప్స్ మధ్య జరుగుతున్న పోటీ యూజర్లకు ఆసక్తికరంగా మారుతోంది. ఒక యాప్‌ను మరొక యాప్.. తమ ఫీచర్లను అప్డేట్ చేయడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఒకే ఫీచర్లతో వేర్వేరు యాప్స్ కూడా తయారవుతున్నాయి. తాజాగా మార్క్ జుకెర్బర్గ్ లాంచ్ చేసిన ‘థ్రెడ్స్’ యాప్ ఓవైపు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుండగానే.. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం అందులో అకౌంట్స్ ఓపెన్ చేసి వినియోగించడం మొదలుపెట్టారు.
సౌత్ స్టార్ హీరోలు చాలామంది ఇప్పటికే థ్రెడ్స్‌లో తమ అకౌంట్స్‌ను ఓపెన్ చేశారు. ఎన్‌టీఆర్ నుండి అల్లు అర్జున్ వరకు చాలామంది ఈ యాప్‌లో యూజర్లుగా మారిపోయారు. అందరికంటే ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. థ్రెడ్స్‌లో అడుగుపెట్టాడు. బయోలో యాక్టర్ అని పెట్టాడు. థ్రెడ్స్ అకౌంట్ క్రియేట్ చేసి 24 గంటలు కాకముందే 3,64,000 మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. థ్రెడ్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసినా కూడా ఇంకా ఏమీ పోస్ట్ చేయలేదు బన్నీ.
అల్లు అర్జున్ తర్వాత ఎన్‌టీఆర్.. థ్రెడ్స్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇందులో జాయిన్ అయ్యి 24 గంటలు అవ్వకముందే 1,54,000 మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్‌లాగానే ఎన్‌టీఆర్ కూడా ఈ యాప్‌లో ఇంకా ఏమీ పోస్ట్ చేయలేదు. హీరోలు మాత్రమే కాదు.. హీరోయిన్స్ కూడా థ్రెడ్స్ యాప్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా.. థ్రెడ్స్‌లో జాయిన్ అవ్వడం మాత్రమే కాకుండా ‘నేను థ్రెడీ. లెట్స్ గో’ అంటూ పోస్ట్ కూడా షేర్ చేసింది.
రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు థ్రెడ్స్‌లో భాగమయ్యాడు. అంతే కాకుండా తన అప్‌కమింగ్ మూవీ ‘ఖుషి’ షూటింగ్ సెట్ నుండి ఒక వీడియోను కూడా అందులో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సమంతో పాటు ఖుషిలో నటిస్తున్న ఇతర యాక్టర్స్ కూడా ఉన్నారు. ఇక వీరితో పాటు శృతి హాసన్, మహేశ్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి.. ఇలా చాలామంది సౌత్ సెలబ్రిటీలు థ్రెడ్స్‌లో అప్పుడే అకౌంట్స్‌ను క్రియేట్ చేసుకున్నారు. దీని ద్వారా ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నారు.