BigTV English

Summer Car Care Tips: బీ కేర్ ఫుల్.. సమ్మర్‌లో కార్లలో వీటిని ఉంచకండి.. ఇవి ఉంటే పేలుతాయ్!

Summer Car Care Tips: బీ కేర్ ఫుల్.. సమ్మర్‌లో కార్లలో వీటిని ఉంచకండి.. ఇవి ఉంటే పేలుతాయ్!
Summer Car Care Tips

Summer Car Care Tips: వేసవి ప్రారంభమై ఎండలు మండుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కూడా ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ప్రజలు కూడా ఎండ వేడిని తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఈ సమయంలో మనం జాగ్రత్తగా ఉండడంతో పాటు కొన్ని వస్తువులను భద్రంగా ఉంచుకోవడం అవసరం ఎంతైనా ఉంది.


ముఖ్యంగా సమ్మర్‌లో కార్లకు కేర్ చాలా అవసరం. ఈ కాలంలో కొందరు పొరపాటున కొన్ని వస్తువులను కార్లలో తీసుకెళ్తుంటారు. కానీ ఈ పొరపాటు వల్ల కార్లలో ఉష్ణోగ్రతలు పెరిగి పేలే అవకాశం ఉందని ఆటోమోబైల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్లలో ఆ వస్తువులను ఉంచకూడదని చెబుతున్నారు. అవేంటో చూడండి.

Also Read: మన మిడిల్ క్లాస్‌కి బెస్ట్ బడ్జెట్ కార్స్.. ఫీచర్లు తగ్గేదేలే!


ఎండ కాలంలో ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు కొందరు సన్ గ్లాసులు వాడుతుంటారు. వీటిని బైక్‌పై వెళ్లే వారు ఎక్కువగా యూజ్ చేస్తారు. కార్లలో కూడా కొందరు సన్ గ్లాసులు ఉపయోగిస్తారు. అయితే వీటిని కార్లలో ఉంచడం మంచిది కాదు. ఒకవేళ ఉంచినా సూర్యరశ్శి పడని చోట ఉంచండి, లేకుంటే ఇందులోని మెయిన్ గ్లాస్ బూతద్ధంలా పనిచేసి మంటలు చలరేగే ప్రమాదం ఉంది. అలానే స్మోకింగ్ హబిట్ ఉంటే లైటర్లు యూజ్ చేయకండి. పొరపాటున వీటని కార్లలో మాత్రం ఉంచకండి.

పాత బ్యాటరీలు లేదా పాడైపోయిన బ్యాటరీలను కూడా కార్ల నుంచి తీసేయండి. వీటిని కార్లలో ఉంచినప్పుడు వేడిని గ్రహించి పేలే అవకాశం ఉంది. కారు స్ప్రేలు, హ్యాండ్ శానిటైజర్లు కూడూ సేఫ్ కాదు. వీటిల్లో ఉండే స్పిరిట్ వేడిని గ్రహించి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఎండవేడికి ఇవి పేలిపోయే ప్రామాదం ఉంది.

Also Read: లెక్సస్ నుంచి లగ్జరీ కార్.. మామా లోపల చూస్తే ఉంటది!

అలానే మీలో ఎవరికైనా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మద్యాన్ని కార్లలో ఉంచకండి. ఇలా ఉంచడం చాలా ప్రమాదం. ఎందుకంటే కారు వేడి అయినప్పుడు కార్పొనేటెడ్ డ్రింక్స్ వేడెక్కి
పేలే అవకాశం ఉంది. అలాగే సన్ క్రీములు, మేకప్ సామగ్రి సైతం కార్లలో ఉంచకండి. ఎందుకంటే కారు ఎండలో ఉన్నప్పుడు వీటిపై ఒత్తిడి పెరిగి పేలే అవకాశం ఉంది.

Related News

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Big Stories

×