BigTV English

Samantha Comments on ‘OO Antava Song’: ఆ సాంగ్ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను: సమంత!

Samantha Comments on ‘OO Antava Song’: ఆ సాంగ్ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను: సమంత!
Samantha latest news
Samantha

Samantha Comments on “OO Antava OO OO Antava” Song: ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ జోష్ లో కనిపించే సమంత ఇప్పుడంతగా కనిపించడం లేదు. కానీ ఇండియా టుడే కాంక్లేవ్ సందర్భంగా సమంత మాట్లాడుతూ మనం లైఫ్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ కరెక్టు కావు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత అది మంచా? చెడా? అనేది తెలుస్తుంది. అప్పుడు ముందు చేసిన వాటిని కొనసాగించాలా? లేక ఆపేయాలా? అనే నిర్ణయాన్ని కరెక్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను చేసిన మిస్టేక్ లనే మళ్లీ మళ్లీ చేయకూడదని అనుకుంటున్నట్టు తెలిపింది.


ఎందుకింత ఉపోద్ఘాతం చెప్పిందంటే… అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేమిటంటే.. ఇక నుంచి తను సినిమాల్లో ఊ… అంటావా… మామ లాంటి పాటలు చేయనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఈ మాట తెలిసిన అభిమానులందరూ హతాశుయులయ్యారు. ఎందుకంటే ఊ…అంటావా మామ.. పాట జనాన్ని ఎంతలా ఉర్రూతలూగించిందో అందిరికీ తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే పుష్ప సినిమాకి బూస్ట్, ప్రమోషన్ ఈ పాటే అని చెప్పాలి. దీనివల్లే పుష్ప పైకి ఎగిరింది. పాన్ ఇండియా రేంజ్ కి చేరింది.

Also Read: Hanuman OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎదురుచూపులే..


కానీ సమంత మాత్రం తన మనసులో మాట చెప్పింది. మనకి ఏదో పాత్ర చేయాలని ఉంటుంది. కానీ చేయలేం. కనీసం ఫుల్ లెంగ్త్ పాత్ర కాకపోయినా, ఒక పాటయినా చేయాలనే కోణంలో నుంచి ఆలోచించి చేసిన పాట ఇదని చెప్పింది. అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్ లో చేసిన పాత్రని పోలి ఉందనే భావనతో ఒప్పుకున్నాను. షూటింగు సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఆ డ్రెస్, ఎక్స్ ప్రెషన్స్, డాన్స్ మూమెంట్స్, అండర్ గ్రౌండ్ వాతావరణం, రఫ్ నెస్… చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని తెలిపింది. అయినా సెక్సీ అనేది తనకు సరిపడదని తేల్చి చెప్పింది.

ఆ పాట చేస్తున్నప్పుడు రేపు చూసిన జనం ఎలా రియాక్ట్ అవుతారోనని వణికిపోయానని చెప్పింది. ఈ సినిమా జీవితానికి ఈ ఒక్క పాట చాలు అని తేల్చి చెప్పింది. అది అలా జరిగి పోయిందంతే అని పేర్కొంది. ఒకప్పుడు నేను అందంగా లేను, ఇతర అమ్మాయిల్లా కనిపించనని అనుకునే దానిని అని సమంత తెలిపింది. కానీ ఇప్పుడు ఊ అంటావా లాంటి పాటలు చేయనని చెప్పేసరికి, సమంత ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం మంచి నిర్ణయమని కొనియాడుతున్నారు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×