Nayanthara: సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ సాధారణంగా తక్కువకాలం పాటు మాత్రమే ఉంటుంది. కానీ, నయనతార ఈ నిబంధనను తుడిచిపెట్టేసినట్లు ఉంది. మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో ఆమె దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ, “లేడీ సూపర్‌స్టార్”గా గుర్తింపు పొందింది. ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో నయన్ టాప్‌లో ఉంటుంది. స్టార్ హీరోల స్థాయిలో ఆమె సినిమాలు వసూళ్లను రాబడుతున్నాయి.
40 ఏళ్లకు పైబడినప్పటికీ, ఆమె గ్లామర్‌ను కొనసాగిస్తూ యంగ్ హీరోయిన్లకు కూడా గట్టిపోటీ ఇస్తోంది. అయితే, కెరీర్ పరంగా టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్న నయనతార వివాదాలతోనూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రస్థానంలోని చేదు అనుభవాన్ని పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ, “హీరో పార్ధీబన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో నేను హీరోయిన్‌గా పరిచయం కావాల్సింది. ఆడిషన్ కూడా పూర్తయ్యింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తొలి రోజు షూటింగ్‌కు ఆలస్యంగా వెళ్లాను. అప్పుడు పార్ధీబన్ నన్ను అందరి ముందూ తిడుతూ, ‘ఈ సినిమాకు నీతో పనిలేదు, వెళ్లిపో’ అని చెప్పేశారు. ఆయన అలా అన్నందుకు నాకు బాధలేదు కానీ, అందరి మధ్య ఆ విధంగా అవమానించడంతో నా మనసు ఎంతో బాధపడ్డది. క్షమించమని అడగాలని అనుకున్నా, ధైర్యం చేసుకోలేక తలదించుకొని వెళ్లిపోయాను” అని చెప్పుకొచ్చింది.
కెరీర్ ప్రారంభంలోనే వచ్చిన ఈ నిరాశను దాటుకుని, నయనతార తన కృషితో, పట్టుదలతో అగ్రస్థాయికి ఎదిగింది. అయితే నయన్ కాంట్రవర్సీలో ఉండడం ఇదే మొదటిసారి కాదు. వెడ్డింగ్ వీడియో విషయంలో ధనుష్ పై ఓపెన్ గానే కామెంట్స్ చేసిన నయన్ కి కోలీవుడ్ సినీ అభిమానుల నుంచి హ్యూజ్ బ్యాక్ లాష్ ఫేస్ చేసింది. నేను రౌడీ సినిమా ఫుటేజ్ ని ప్రొడ్యూసర్ అయిన ధనుష్ పర్మిషన్ లేకుండా నయన్, నెట్ఫ్లిక్స్ కి ఇచ్చిన తన వెడ్డింగ్ వీడియోలో వాడడం దగ్గర మొదలైన గొడవ, నయన్ ని విపరీతంగా ట్రోల్ చేయడానికి కారణం అయ్యింది.
ఇది సద్దుమణిగింది అనుకునే లోపు నయనతార-విజ్ఞేశ్ శివన్ మాములు మనుషులు కాదు ఆకాశం నుంచి దిగివచ్చారు అంటూ స్టూడెంట్ చేసిన కామెంట్స్ మరింత వైరల్ అయ్యాయి. ఒక ఈవెంట్ కి వెళ్లిన నయన్-విజ్ఞేశ్ అక్కడ ఉన్న వాళ్లని ఫోటో దిగడానికి కూడా దగ్గరికి రానివ్వలేదు. దీంతో అదో పెద్ద గొడవ అయ్యింది. ఇలా గత కొంతకాలంగా నయన్ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది అంటే అది కాంట్రవర్సీనే అయ్యి ఉంటుంది..