Petdog kills Newborn Baby| తన యజమానికి పుట్టిన నవజాత శిశువుని ఒక పెంపుడు కుక్క ప్లాన్ చేసి మరీ చంపేసింది. ఆ పసిపాపను చూస్తే ఓర్వలేకే హత్య చేసింది. ఈ ఘటన రష్యా దేశంలో జరిగింది. రష్యాలోని సైబీరియా రాష్ట్రం సెవర్స్క్ లో నివసించే దంపతులు చాలా కాలంగా ఓ మరుగుజ్జు కుక్క (సాసేజ్ డాచెస్‌హండ్ జాతి కుక్క )ను ఇంట్లో పెంచుకుంటున్నారు. ఈ కుక్కనే వారి పసిపాపను హత్య చేసిందని ఆ ఇంటి యజమానులు పోలీసు అధికారులతో చెప్పారు.
రష్యా మీడియా కథనాల ప్రకారం.. సెవర్స్క్ కు చెందిన ఆ దంపతులకు కొనేళ్ల క్రితం ఒక బాబు పుట్టాడు అతనికి 6 సంవత్సరాల వయసు. అయితే బాబు పుట్టినప్పటి నుంచి కుక్క ముందులా సరదాగా ఉండడం లేదు. అయినా ఆ దంపతులు ఆ కుక్కను ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ కుక్క మాత్రం ఎప్పుడూ కోపంగా ఉండేది. తరుచూ ఇంటికి వచ్చే అతిథులు, తమ బాబుపై దాడులు చేసేది.. అయినా ఆ కుటుంబ యజమాని దాన్ని ఎంతో ప్రేమగా చూసేకునేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 2025లో ఇంటి యజమాని భార్య ఒక పాపకు జన్మనిచ్చింది. పాపను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచి ఇంట్లోని పెంపుడు కుక్క ఎక్కువగా ఆడుకునేది కాదు. ఒంటరిగానే ఓ మూలలో కూర్చొనేది. దాన్ని యజమాని దెగ్గరకు తీసుకుందామని ప్రయత్నించినా దాడి చేయడానికి వచ్చేది. కుక్క ప్రవర్తనలో మార్పు గమనించిన యజమానికి దాన్ని వీలైనంత వరకు ఇంటి బయట ప్రత్యేకంగా కెన్నెల్ నిర్మించి అందులోనే పెట్టేవాడు.
Also Read: మా ఆడోళ్లు తాగుబోతులయ్యారు.. కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తలు!
ఈ క్రమంలో మార్చి 10, 2025న రాత్రి పసిపాపను క్రిబ్ (ఊయల లాంటి చెక్కతో తయారు చేసిన పసిపిల్లల బెడ్) లో పడుకోబెట్టి ఆ దంపతులు కూడా నిద్రపోయారు. తెల్లవారు లేచిన తరువాత పాప తల్లి.. క్రిబ్ వద్దకు వచ్చి చూస్తే.. పాప శరీరమంతా రక్తమే.. ఆమె ఒళ్లంతా పంటితో కొరికినట్లు గాయాలున్నాయి. పాపను ఎత్తుకొని చూడగా.. చలనం లేదు. దీంతో పరుగు పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లగా పాప మరణించినట్లు వైద్యులు తెలిపారు. నెల రోజులు కూడా నిండని పసి బిడ్డను అంత కృూరంగా ఎవరు చంపుతారని? అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో పోలీసుల విచారణ ప్రారంభమైంది.
పాప శరీరంపై ఉన్న పంటి గుర్తులను బట్టి.. అవి తమ కుక్క పంటి గుర్తులని యజమాని అధికారులకు తెలిపాడు. దీంతో ఆ కుక్కను అధికారులు అదుపులోకి తీసుకొని పరిశీలించగా.. అది నిజమేనని తేలింది. కుక్క ప్రవర్తన సరిగా లేదని తెలుసుకొని.. ఆ కుక్క యజమాని పిల్లలను చూస్తే అసూయతో ఓర్వలేక ఈ హత్య చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. కానీ పసిపాప తల్లిదండ్రులు నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని అధికారులు తేల్చారు. దీంతో ఆ కుక్క యజమాని కోపంతో దాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కోర్టులో తన కుక్కును కారుణ్య మరణం (యుధనైజ్ – విషపు ఇంజెక్షన్ తో మరణం) విధించాలని కోరాడు. కానీ కోర్టు అందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఆ కుక్క అనిమల్ కంట్రోల్ విభాగం అధికారుల సంరక్షణలో ఉంది. 8 ఏళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకున్న తన కుక్క తన కన్నబిడ్డను చంపేయడంపై ఆ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలాంటిదే ఇంకో ఘటన ఇంగ్లాడ్ లో కూడా జరిగింది. అక్కడ కూడా ఇలాంటి రెండు మరుగుజ్జు కుక్కలే తమ యజమానిని చంపేశాయి. ఇంగ్లాండ్ లోని స్విండన్ ప్రాంతానికి చెందిన జెమ్మా హర్ట్ అనే 43 ఏళ్ల మహిళ తన ఇంట్లో రెండు డాచెస్ హండ్ కుక్కలను పెంచుకునేంది. అయితే గత క్రిస్మస్ (డిసెంబర్ 2024) నుంచి ఆమె ఒక్కసారిగా కనబడ కుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. కానీ జనవరి నెలలో ఒక తన ఇంటి నుంచి కొద్ద దూరంలో ఉన్న ఒక అడవి లాంటి ప్రాంతంలో శవమై తేలింది. ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం చేయగా.. ఆమె శరీరంపై కుక్కలు కరిచినట్లు గాయాలున్నాయి. అడవిలో ఇంకా గాలించగా.. ఒక పెంపుడు కుక్క మరణినంచినట్లు అధికారులు గుర్తించారు. మరో కుక్క కూడా బలహీన స్థితిలో లభించింది.