IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (Indian Premier League 2025 Tournament ) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మరో వారం రోజుల్లోపే ఈ టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. మార్చి 22వ తేదీ నుంచి మే నెల 25వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన పది జట్లు కూడా.. ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ తరుణంలోనే… ఈసారి ఎలాగైనా కప్ ఎగిరేసుకుపోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad team ) యాజమాన్యం భావిస్తోంది. దీని కోసం ప్లేయర్లతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిస్తోంది హైదరాబాద్.
Also Read: WPL 2025: దరిద్రం అంటే వీళ్లదే… మూడు సార్లు ఫైనల్స్ ఓడిపోయారు !
ఇక ఈ తరుణంలోనే… సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును రెండు గ్రూపులుగా విడగొట్టి తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడించారు. ఇందులో ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) అద్భుతంగా రాణించడం జరిగింది. సిక్స్ లు, ఫోర్ లతో రచ్చ రచ్చ చేశాడు ఇషాన్ కిషన్. మొదటి ఇన్నింగ్స్ లో 24 బంతుల్లో 64 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. ఆ తర్వాత 30 బంతుల్లో 70 పరుగులు చేసి చుక్కలు చూపించాడు. ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ కొట్టే సిక్సులు ఉప్పల్ స్టేడియం అవతలో పడుతున్నాయి. ఇషాన్ కిషన్ తో పాటు అభిషేక్ శర్మ కూడా అదరగొడుతున్నాడు.
8 బంతుల్లోనే 28 పరుగులు చేసి… దుమ్ము లేపాడు అభిషేక్ శర్మ. అటు అంకిత్ వర్మ కూడా ప్రాక్టీస్ మ్యాచ్ లో రఫ్ ఆడించాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో 17 బంతుల్లో 46 పరుగులు చేసి దుమ్ము లేపాడు అంకిత్ వర్మ. ఇషాన్ కిషన్… ఇప్పుడు హైదరాబాద్ టీం లో.. కొరకరానికి కయ్యగా మారిపోయాడు. మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ ఓపెనర్ గా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్… ఇకపై హైదరాబాద్ తరఫున ఆడబోతున్నాడు. ఇప్పటికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad team )కు ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ చేసేవారు. ఈ సారి ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) వచ్చాడు కాబట్టి… అతన్ని ఓపెనింగ్ కు దింపుతారా? మొదటి వికెట్ కు దించుతారా చూడాలి. కాగా… మొన్న జరిగిన మెగా వేలంలో…. ఇషాన్ కిషన్ ( Ishan Kishan )ను రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది హైదరాబాద్ ఓనర్ కావ్యా పాప.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2025 టీం :
బ్యాటర్స్: ఇషాన్ కిషన్, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్
ఆల్ రౌండర్లు: హర్షల్ పటేల్, కమిందు మెండిస్, వియాన్ ముల్డర్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి
బౌలర్లు: పాట్ కమిన్స్, మహ్మద్ షమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ
Also Read: Pakistan Cricket: జింబాబ్వే కంటే పాక్ దారుణం.. కొత్త ప్లేయర్లు వచ్చినా.. తలరాత మారలేదు !
Ishan Kishan smashed 64 in 23 balls in the SRH Intra squad match. 🔥pic.twitter.com/31uqq85gGf
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2025