BigTV English

NBK 109 : బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ సెంటిమెంట్… అందుకే ఆ రిలీజ్ డేట్ పై కన్ను

NBK 109 : బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ సెంటిమెంట్… అందుకే ఆ రిలీజ్ డేట్ పై కన్ను

NBK 109 : 2025 సంక్రాంతి సందర్భంగా ఈసారి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాల జాతర జరగబోతోంది. ఆ జాతరలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా పాలుపంచుకోబోతున్న విషయం తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ బాబీ (Bobby)తో కలిసి నందమూరి బాలకృష్ణ NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ సినిమాకు ‘డాకు మహారాజా’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ అల్లు అర్జున్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారనేది తాజా సమాచారం.


అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురం’ (Ala Vaikuntapurramuloo)లో సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలిచింది. ఈ మూవీ 2020 జనవరి 12న రిలీజ్ అయి, భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సినిమా రిలీజ్ డేట్ వెనుక ఈ సెంటిమెంట్ ఉందనే టాక్ నడుస్తోంది.

మేకర్స్ 2025 జనవరి 12 రిలీజ్ డేట్ ను పరిశీలించడం వెనక ‘అల వైకుంటపురం’ (Ala Vaikuntapurramuloo)లో సెంటిమెంట్ ను మేకర్స్ ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల విషయంలో సెంటిమెంట్ గా కనిపిస్తోంది కేవలం రిలీజ్ డేట్ మాత్రమే కాదు డే కూడా. అప్పట్లో ‘అల వైకుంఠపురం’ రిలీజ్ డేట్ ఆదివారం, ఇప్పుడు బాలయ్య NBK 109 సినిమాను రిలీజ్ చేయబోతున్నారు అంటూ వినిపిస్తున్న జనవరి 12 కూడా ఆదివారం రోజు రాబోతోంది. దీంతో లక్కీ సెంటిమెంట్ గా భావించిన నిర్మాతలు ఆదివారం రోజునే NBK 109 మూవీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.


మరి భారీ అంచనాలున్న ఈ సినిమాను ప్రస్తుతం టాక్ నడుస్తున్నట్టుగా జనవరి 12న రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉండగా దీపావళి కానుకగా ట్రైలర్ బాలయ్య, డైరెక్టర్ బాబి మూవీ NBK 109 టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

బాలయ్య కెరీర్ లో 109 సినిమా ఇది. ఇదిలా ఉండగా బాలకృష్ణ NBK 109 మూవీ రిలీజ్ కావడానికి రెండు రోజులు ముందుగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్ రిలీజ్ కాబోతోంది. జనవరి 12న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే అనౌన్స్ చేశారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×