E-Paper
Advertisement

NBK 109: ముందుకా వెనక్కా.. కన్ఫ్యూజన్‌లో బాలయ్య

NBK 109: ముందుకా వెనక్కా.. కన్ఫ్యూజన్‌లో బాలయ్య
Advertisement

NBK 109: సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. అందుకే స్టార్ హీరోలు అయినా, సీనియర్ హీరోలు అయినా ముందుగానే సంక్రాంతి రేసులో తమ ప్లేస్‌ను ఖరారు చేసుకుంటారు. ఎంత పోటీ ఉన్నా అసలు ఆ ప్లేస్ నుండి తప్పుకోవడానికి వెనకాడరు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) కూడా 2025 సంక్రాంతికి తన ప్లేస్‌ను ఫిక్స్ చేసుకున్నారు. ‘ఎన్‌బీకే 109’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అంతా ఫిక్స్ అయినా కూడా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మరొక సమస్య వచ్చిపడినట్టుంది. దీనివల్ల ముందుకు కదలాలా? వెనక్కి తప్పుకోవాలా? అని ‘ఎన్‌బీకే 109’ మేకర్స్ కన్ఫ్యూజన్‌లో పడిపోయారు.

పెద్ద సమస్యే వచ్చిందే

Advertisement

‘ఎన్‌బీకే 109’ (NBK 109) 2025 సంక్రాంతికి రావడం పక్కా. కానీ డేట్ విషయంలో మాత్రమే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏర్పడింది. జనవరి 9 లేదా జనవరి 12 తేదీల్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. అయితే రెండు తేదీల్లో అడ్వాంటేజ్‌లు ఏంటి అని కూడా చర్చలు మొదలయ్యాయట. జనవరి 9న ‘ఎన్‌బీకే 109’ విడుదలయితే సంక్రాంతి బరిలో ముందుగా దిగుతున్న సినిమా కావడంతో కచ్చితంగా ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓపెనింగ్స్ గురించి ఆలోచించకుండా జనవరి 12న కూడా ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చు. కానీ అక్కడ వీరు పెద్ద సమస్యను ఎదుర్కోవాలి. అదే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer).

Also Read: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా హిట్ 3.. కాశ్మీర్లో షూటింగ్..ఆ రోజు నుంచే..!

Advertisement

రంగంలోకి దిల్ రాజు

శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘గేమ్ ఛేంజర్’. దాదాపు సంవత్సరం నుండి అసలు ఈ సినిమా ఉందా లేదా అనే కన్ఫ్యూజన్‌లోనే మెగా ఫ్యాన్స్ గడిపేస్తున్నారు. పైగా అభిమానులను ఎగ్జైట్ చేసే రేంజ్‌లో కూడా ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. అదే సమయంలో 2025 సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. పైగా ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా.. థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యిందంటే వార్ వన్ సైడ్ అయ్యిందనే అనుకోవాలి. ఇప్పుడు అదే ‘ఎన్‌బీకే 109’ మేకర్స్‌ను టెన్షన్ పెడుతోంది.

థియేటర్లు తగ్గుతాయి

జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు సిద్ధమయ్యింది. జనవరి 9న ‘ఎన్‌బీకే 109’ సినిమా థియేటర్లలో విడుదలయితే ఓపెనింగ్స్ బాగా వస్తాయి. అలా కాకుండా ‘గేమ్ ఛేంజర్’ విడుదలయిన తర్వాత అంటే జనవరి 12న ఈ మూవీ వచ్చిందంటే కచ్చితంగా ‘ఎన్‌బీకే 109’కు ఎక్కువగా థియేటర్లు దొరకడం కూడా కష్టమే అయిపోతుంది. థియేటర్లు తక్కువగా లభిస్తే లాంగ్ రన్‌లో కలెక్షన్స్‌పై కూడా దెబ్బపడుతుంది. అప్పుడు పూర్తిగా కంటెంటే ఈ సినిమాను కాపాడాల్సి వస్తుంది. కొన్నాళ్ల క్రితం సంక్రాంతికి బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ముందు, వెనుక రిలీజ్ అయ్యాయి. అయినా ‘వాల్తేరు వీరయ్య’కే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మళ్లీ అలా జరగకూడదని బాలయ్య ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×