BigTV English

Nandamuri Balakrishna: వారసులు లేకుండా సంబరాలా.. ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ?

Nandamuri Balakrishna: వారసులు లేకుండా సంబరాలా.. ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ?

Nandamuri Balakrishna:  ఇప్పటికే మెగా – అల్లు కుటుంబాల మధ్య  విభేదాలుఅని వస్తున్న రూమర్స్ లో ఏది నిజమో ఏది అబద్దమో తేల్చుకోలేని పరిస్థితిలు ఉన్నారు ఫ్యాన్స్. అదే ఇంకా తేలలేదు. ఇప్పుడు నందమూరి కుటుంబంలో కూడా ఇలాంటి విభేదాలు బయటపడే సమయం వచ్చేసింది. నందమూరి తారక రామారావు నట వారసుడుగా నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు పూర్తి అయ్యాయి.


ఇక దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ.. ఆయనకు సత్కారం చేయడానికి ఒక పెద్ద ఈవెంట్ ను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.  ఎన్‌బీకే గోల్డెన్‌జూబ్లీ వేడుక.. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ నోవోటెల్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరు హాజరుకానున్నారు. ఇప్పటికే  ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖలు ఆహ్వానాలు అందుకున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతా బావున్నా.. అసలు సిసలైన వారసులే ఈవెంట్ కు రావడం లేదట.  అసలు సిసలు వారసులు అంటే ఎవరు అని అనుకుంటున్నారా.. బాలకృష్ణ అన్న హరికృష్ణ  కొడుకులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.


మొదటి నుంచి బాలకృష్ణ.. అన్న కొడుకులను దూరం పెడుతున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అవి నిజమే అని బాలకృష్ణ నిరూపిస్తూనే ఉన్నాడు. టీడీపీ విషయంలో, రాజకీయపరంగా కూడా ఎన్టీఆర్ అసలు పట్టించుకోవడం లేదు. ఇక తమ్ముడికి తోడుగా కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు.

బాబాయ్ – అబ్బాయ్ లు కలిసి చాలారోజులే అవుతుంది. బాలయ్య ఇంట ఫంక్షన్ కు వెళ్లినా.. ఎన్టీఆర్ కు అవమానాలు తప్పడం లేదు అన్నది  ఫ్యాన్స్ మాట. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ శతదినోత్సవానికి కూడా ఈ ఇద్దరు వారసులు రాలేదు. ఇక ఇప్పుడు ఈ   ఎన్‌బీకే గోల్డెన్‌జూబ్లీ వేడుకులకు కూడా ఈ అన్నదమ్ములు రావడం లేదని తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య తరువాత నందమూరి లెగసీని కాపాడే వారసులు అంటే వీరే. వీరి తరువాతనే మోక్షజ్ఞ కానీ, ఇంకా ఇతర వారసులు కానీ, అలాంటి ఈ ఇద్దరు అన్నదమ్ములు లేకుండా నందమూరి ఇంట ఎలాంటి ఫంక్షన్  అయినా ఎలా జరుగుతుంది అనేది ఫ్యాన్స్ మాట.

ఇప్పుడు కాకపోయినా.. ఏదో ఒక రోజున తారక్.. టీడీపీ లో అడుగుపెట్టాలసిందే.  మరి బాలయ్య.. ఈ ఇద్దరు అన్నదమ్ములను ఎందుకు అంత దూరం పెడుతున్నాడు.. ? దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులకు ఈ ఈవెంట్‌ ఆహ్వానాలు అందగా టాలీవుడ్‌లోని ఇద్దరు బ్రదర్స్‌కు ఎటువంటి ఇన్విటేషన్‌ అందలేదు అంటే అది వారిని అవమానించడమే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ తల్లితో పాటు కుందాపురంలో ఉన్నాడు. రేపు హైదరాబాద్ వస్తాడా.. ? అక్కడే ఉంటాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇంకోపక్క కళ్యాణ్ రామ్.. తన సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. మరి ఈ ఇద్దరు అన్నదమ్ములకు నిజంగానే ఆహ్వానం అందలేదా.. ? ఒకవేళ అందినా వారే రాకూడదని అనుకుంటున్నారా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×