E-Paper
Advertisement

NC 22 First Look : నాగ చైతన్య ద్వి భాషా చిత్రం టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ విడుదల

NC 22 First Look : నాగ చైతన్య ద్వి భాషా చిత్రం టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ విడుదల
Advertisement

NC 22 First Look : అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం NC 22. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కస్టడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. నాగ చైతన్య పుట్టినరోజు (నవంబర్ 23) సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయటంతో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే.. నాగ చైతన్య పోలీస్ డ్రెస్‌లో కనిపిస్తున్నారు. ఆయన్ని పోలీసులు పట్టుకున్నారు. గన్స్ ఎక్కు పెట్టి నిలుచున్నారు. చైతు మాత్రం ఎవరినో సీరియస్‌గా చూస్తున్నాడు. తన లుక్ కూడా గత చిత్రాల కంటే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇందులో చైతన్య పోలీస్ ఆఫీసర్ అని కొందరంటుంటే.. కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ సస్పెన్స్‌కి తెర పడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

బంగార్రాజు చిత్రంతో నాగ చైతన్యతో జత కట్టిన శాండిల్ వుడ్ బ్యూటీ కృతి శెట్టి మరోసారి హీరోయిన్‌గా కనిపించనుంది. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదొక సీరియస్ ఇష్యూ మీద సాగే సినిమా అని అర్థమవుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండటం విశేషం. ఎస్.ఆర్.కదిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

    Related News

    Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

    Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

    పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

    యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

    Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

    Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

    Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

    Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

    Big Stories

    Advertisement
    ×