BigTV English

Sai Dharam Tej – Producer Niranjan Reddy: మెగా హీరోపై రూ.125 కోట్ల బడ్జెట్.. పెద్ద రిస్కే ఇది..!

Sai Dharam Tej – Producer Niranjan Reddy: మెగా హీరోపై రూ.125 కోట్ల బడ్జెట్.. పెద్ద రిస్కే ఇది..!

SDT 18 Movie Budget: మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. గతంలో ‘విరూపాక్ష’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. అతడి సినీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా విరూపాక్ష నిలిచింది. దీని తర్వాత బ్రో సినిమా చేశాడు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది.


కానీ బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్‌ను అందుకుంది. అయితే ఈ సారి ఎలాగైనా ఒక భారీ హిట్ కొట్టాలని సాయి తేజ్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో ఓ మూవీ చేయనున్నాడు. ఇటీవల ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్‌‌ను రిలీజ్ చేయగా.. ప్రేక్షకాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘హనుమాన్’ వంటి భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నిరంజన్ రెడ్డి ఇప్పుడు ఈ కొత్త సినిమాకు భారీగా బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 18వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా బడ్జెట్ చూసి సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు.


Also Read: మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ సర్‌ప్రైజ్ వచ్చేస్తుంది.. ఏంటో తెలుసా?

ఈ కొత్త సినిమాకు దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్‌ను నిర్మాత నిరంజన్ రెడ్డి కేటాయించాడని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. సాయి ధరమ్ తేజ్‌తో ఇంత బడ్జెట్ పెట్టి నిర్మాత చాలా రిస్క్ చేస్తున్నాడని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. సాయి ధరమ్ కెరీర్‌లో ఒక వంద కోట్లు రాబట్టని సినిమా కూడా లేదని.. అలాంటి హీరోతో రూ.125 కోట్ల బడ్జెట్ పెట్టడం మూర్ఖత్వమని అంటున్నారు. అది కూడా ఒక స్టార్ దర్శకుడు కూడా కాదని.. కొత్త దర్శకుడితో ఇలాంటి సాహసం చేయడం పెద్ద రిస్కే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ విషయంలో నిర్మాత నిరంజన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. తాను కేవలం కథను మాత్రమే నమ్ముతానని.. కథ డిమాండ్ చేస్తే ఎంత మొత్తాన్నైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని నిర్మాత నిరంజన్ రెడ్డి అంటున్నాడని సమాచారం. ఇంతకు ముందు హనుమాన్ సినిమాను కూడా కథను నమ్మే బడ్జెట్ పెట్టానని.. ఆ సినిమా తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని.. ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం కూడా ఉందని అతడు అంటున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×