BigTV English

Pear Fruits Benefits: వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్‌ పెట్టాలంటే.. ఈ ఫ్రూట్స్‌ తింటే సరి!

Pear Fruits Benefits: వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్‌ పెట్టాలంటే.. ఈ ఫ్రూట్స్‌ తింటే సరి!

Pear Fruits Improve Immunity During Monsoon: వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి వాతావరణం.. వేడి వేడి గా బజ్జీలు, హాట్ హాట్ సమోసా ఇలాంటివి తినాలనిపిస్తుంటుంది. కానీ ఇవి తినే ముందు ఈ విషయాలను మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిందే.. ఎందుకంటే వానాకాలం చల్లదనమే కాదు.. అనేక రోగాలను వెంటబెట్టుకొని వస్తుంది. ఈ కాలంలో ఎక్కువగా వైరల్ ఇన్ ఫెక్షన్ లు, డెంగ్యూ ఫీవర్, మలేరియా, జలుబు, దగ్గు, వంటి రోగాలు ఎక్కవగా వస్తుంటాయి. వీటి నుండి తట్టుకోవాలంటే రోగ నిరోధక శక్తి చాలా అవసరం. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. సీజనల్ ఫ్రూట్స్ తినాలి. అయితే ఈ సీజన్ లో దొరికే బేరిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఈ ఫ్రూట్స్ ని తినడం కలిగే లాభాలేంటో తెలుసుకుందాం..


మధుమేహాన్ని నియంత్రిస్తుంది..

మధుమేహంతో బాధపడేవారు పియర్ ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. మధుమేహ వ్యాధిని తగ్గించే ఆంథోసైనిన్ పియర్‌లో పుష్కలంగా లభిస్తుంది. పియర్ ఫ్రూట్ లో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.


గుండెకు మేలు చేస్తుంది.
బేరి పండును తినడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాపడతాయి. బేరిపండులో ప్రొసైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. పియర్ ఫ్రూట్స్ పై తొక్కలో కూడా అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. బేరి పండు తొక్కలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇవి బీపీని నియంత్రించడంలో తోడ్పడతాయి.

శరీరంలో మంటను తగ్గిస్తుంది.
బేరి పండులో విటమిన్ ఎ, విటమిన్ కె, అధికంగా ఉన్నాయి. అంతే కాదు బేరిపండులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. గాయాల కారణంగా శరీరంలోని వాపును నియంత్రించడంలో సహాయపడతాయి.

Also Read: జుట్టు కుదుళ్ల నుంచి బలంగా ఉండటానికి హోం మేడ్ కండీషనర్స్

జీవక్రియను మెరుగుపరుస్తుంది.
బేరి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. మలబద్దంకంతో బాధపడేవారు ఈ ఫ్రూట్స్ ను తింటే ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది
పియర్ ఫ్రూట్స్ ను తినడం వలన బరువు తగ్గాలనుకునే వారు పియర్ ఫ్రూట్స్ ని తింటే సూపర్ గా పనిచేస్తుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి ఒబిసిటీ వంటి వాటినుండి రక్షణనిస్తాయి.

 

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×