Netflix: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టైర్ -2 హీరోగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య (Naga Chaitanya).. సమంత(Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమెతో నాలుగేళ్లు వైవాహిక బంధంలో గడిపిన తర్వాత విడాకులు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.ఇకపోతే విడాకులు తర్వాత సమంతను చాలామంది నిందించారు. కానీ నాగచైతన్యను ఏ ఒక్కరు కూడా టార్గెట్ చేయలేకపోయారు కారణం బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. మరోవైపు ఈయన సమంత నుంచి విడాకులు ప్రకటించిన మరుసటి ఏడాదే, యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ (Shobhita dhulipala)తో ప్రేమలో పడ్డారు. డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించినా.. దీనిపై ఎవరు స్పందించలేదు. అయితే ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.
అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా పెళ్లి..
ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. “సమంతతో నా జర్నీ చక్కగా సాగలేదు. అందుకే ఇప్పుడు శోభితతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నానని” తెలిపారు. ఇకపోతే నాగచైతన్య, శోభిత ధూళిపాళ డిసెంబర్ 4వ తేదీన ఏడు అడుగులు వెయ్యబోతున్నారని సమాచారం. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswar Rao) విగ్రహం ముందు.. పెద్దల సలహా మేరకు ఆయన ఆశీస్సులతో వివాహం జరగబోతున్నట్లు నాగచైతన్య వెల్లడించారు.
పెళ్లి వీడియో హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్..
ఇదిలా ఉండగా మరోవైపు తాజాగా వీరి పెళ్లి హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Net flix)భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య – శోభిత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకుండా.. నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేలా శోభిత ప్లాన్ చేసిందట.అంతేకాదు ఈమె నిర్ణయాన్ని నాగచైతన్య కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు వీరి పెళ్లి వీడియోకి సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ.50 కోట్లకు దక్కించుకుందని తెలిసింది.
నయనతారను ఫాలో అవుతున్న శోభిత..
ఇకపోతే ఈ జంట ఇప్పుడు నయనతార (Nayanthara) – విగ్నేష్ శివన్ (Vignesh Shivan) బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరు వివాహం చేసుకున్నప్పుడు కూడా.. తమ పెళ్లి వీడియోని నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల నయనతారపై నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈమె బాటలోనే శోభిత నడవబోతోందని, అందుకే తమ పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తానికైతే వీరిద్దరికీ సంబంధించిన పెళ్లి వీడియో చూడాలి అంటే.. పెళ్లి తర్వాత నెట్ఫ్లిక్స్ లో వచ్చేవరకు ఎదురు చూడాలన్నమాట.
పెళ్లి పనులు ప్రారంభించిన శోభిత..
ఇప్పటికే పెళ్లి పనులు దాదాపుగా ప్రారంభమయ్యాయని చెప్పాలి. మరోవైపు శోభిత దూళిపాళ తన ఇంట్లో పెళ్ళికి ముందు సాంప్రదాయంగా జరిగే, పసుపు దంచడం గోధుమ రాయి వంటి పనులు మొదలుపెట్టేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది. ఇక నాగచైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.