Devara 2 Update: తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిన దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR)చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్(RRR).ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదలై ఏకంగా ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్(Ram Charan)కలసి నటించారు. ఇకపోతే ఈ సినిమా అందించిన జోరుతో వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు ఎన్టీఆర్ అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సౌత్ స్టేట్స్లో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా నార్త్ లో మాత్రం భారీ ఆదరణ పొందింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ క్రమంలోనే అసలు దేవర 2 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అసలు ఈ సినిమా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలాంటి కథతో రాబోతోంది? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ఆడియన్స్ ముందు వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. ‘దేవర 2’ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయట. దర్శకుడు కొరటాల శివ (Koratala shiva) బృందం దీనిపై పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో పడిందని తెలుస్తోంది. ముఖ్యంగా దేవర ను మించి పార్ట్ 2 ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకోసమే స్క్రిప్ట్ కూడా బలంగా తయారు చేస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమా నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దేవర 2 సినిమా షూటింగ్ వచ్చే యడాది జూలైలో ప్రారంభిస్తారట. ఇప్పటికే కొంత భాగం పార్ట్ 2 షూటింగ్ పూర్తి చేశారట. ఇక అలాగే దేవర సినిమాలో తండ్రి చనిపోయినట్టు చూపించారు? క్లైమాక్స్లో కొడుకు వర కూడా చనిపోయినట్లు చూపించారు? కానీ దేవర 2 లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వీరిని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సముద్రంలో ఫైట్ హైలైట్ గా ఉంటుందని.. అసలు దేవర ఏమయ్యాడు? దేవరా ను వరా ఎందుకు చంపేశాడు? అనేది చూపించబోతున్నారట. అంతేకాదు ఇందులో తాత ఎన్టీఆర్ కూడా కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఆయన పాత్ర ఒక ఎపిసోడ్లో కనిపిస్తుందట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. పార్ట్ 2 లో తండ్రి, కొడుకే కాదు తాత గెటప్ లో కూడా ఎన్టీఆర్ కనిపించబోతున్నారని సమాచారం.
ఎన్టీఆర్ సినిమాలు..
ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ‘వార్ -2’ సినిమా చేస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్( Hrithik Roshan) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ (Prashant Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జూలైలోపు పూర్తి చేసి దేవర -2 ప్రారంభించబోతున్నట్లు సమాచారం.