BigTV English

Keerthy Suresh: పెళ్లి తరువాత కూడా కీర్తి అందాల ఆరబోత.. దాన్ని వేసుకొని కూడా.. ?

Keerthy Suresh: పెళ్లి తరువాత కూడా కీర్తి అందాల ఆరబోత.. దాన్ని వేసుకొని కూడా.. ?

Keerthy Suresh: 2024  సెలబ్రిటీలకు బాగా కలిసొచ్చింది. చాలామంది ఒంటరితనాన్ని వదిలేసి జంటగా మారారు. ప్రేమించినవారిని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్టులో కోలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఒకరు. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్ తో ఆమె వివాహం డిసెంబర్ 12 న గోవాలో ఘనంగా జరిగింది.


ముఖ్యంగా గోదాదేవి గెటప్ లో కీర్తి సురేష్, శ్రీ రంగనాథుడి గెటప్ లో ఆంటోని  కనిపించి అందరికీ కన్నులవిందు చేశారు. ఆ తరువాత వీరిద్దరూ క్రిస్టియన్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు  నెట్టింట వైరల్ గా మారాయి.

Nandamuri Mokshagna: కల్కి డైరెక్టర్ తో మోక్షజ్ఞ డెబ్యూ.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్


ఇక పెళ్లి తరువాత  కీర్తి.. హనీమూన్ లో బిజీగా ఉంటుంది అనుకుంటే ఇదుగో ఇలా తన సినిమా ప్రమోషన్స్ లో కనిపించి షాక్ ఇచ్చింది. నేను శైలజ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కీర్తి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ లో పాతుకు పోయింది. ఇక మహానటి సినిమాతో కేవలం తెలుగు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

మొదటి నుంచి కూడా గ్లామర్ కు నో చెప్తూ వచ్చిన ఈ చిన్నది.. బాలీవుడ్ కు వెళ్లి అందాల గేట్లు ఎత్తేసింది. బొద్దుగా ఉన్న ఈ భామ సన్నబడి.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం బేబీ జాన్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తేరి సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ్ లో  విజయ్ చేసిన పాత్రలో వరుణ్ ధావన్ కనిపించగా.. సమంత పాత్రలో కీర్తి సురేష్ మెరిసింది.

Kriti Sanon: పింక్ శారీలో పరమ్ సుందరి.. పెళ్లిళ్ల సీజన్‌లో వెరీ బిజీ

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కీర్తి సురేష్ అందాల ఆరబోత చూసి ఫ్యాన్స్ నోళ్లు వెళ్లబెడుతున్నారు. క్రిస్టమస్ కానుకగా ఈ సినిమా  డిసెంబర్  25 న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా క్రిస్టమస్ ఈవెంట్ నిర్వహించారు.

ఇక ఈ ఈవెంట్ లో అందరూ రెడ్ కలర్ డ్రెస్ లు వేసుకొని, క్రిస్టమస్ క్యాప్ స్ పెట్టుకొని  సందడి చేశారు. ఈ ప్రమోషన్స్ కు కీర్తి కూడా అటెండ్ అయ్యింది. రెడ్ కలర్ స్లీవ్స్ డిజైనర్ సురేష్ వేసుకొని అందంగా కనిపించింది.  కొత్త పెళ్లి కూతురు కావడంతో.. మెడలో ఉన్న పసుపుతాడును అలాగే ఉంచేసింది. ఆ రెడ్ కలర్ డ్రెస్ పై పసుపు తాడు హైలైట్ గా నిలిచింది. కీర్తిని ఇక్కడ చూసిన అభిమానులు.. కొత్త పెళ్లి కూతురు హనీమూన్ లో ఉంటుంది అనుకుంటే.. ఇక్కడ ఉందేంటి..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో కీర్తికి బాలీవుడ్ లో ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×