Nandamuri Mokshagna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ టాలీవు ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు అసలు మనోడు వస్తాడు.. వస్తాడు అంటున్నారు కానీ, ఇంకా రాలేదు అనుకున్నారు. ఎట్టకేలకు మోక్షు మొదటి సినిమా అధికారికంగా ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ చేతిలో కొడుకును పెడతాడు అనుకుంటే.. బాలయ్య జనరేషన్ కు తగ్గట్టు ఆలోచించి కుర్ర డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ చేతిలోపెట్టడంతో.. ఏం పర్లేదు.. ఏం పర్లేదు .. బాబు మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటాడు అని ధైర్యంగా నిలబడ్డారు ఫ్యాన్స్. ఇక సింబా వస్తున్నాడు అని ప్రశాంత్ వర్మ చెప్పడంతో.. అంతా నీ దయనే అనుకున్నారు. ఎలాగూ ప్రశాంత్ యూనివర్స్ లో రెండో సినిమా కాబట్టి కచ్చితంగా సూపర్ హీరో కథనే ఉంటుందని మరింత హైప్ తెచ్చుకున్నారు.
Folk Singer Shruthi: సింగర్ శృతి ఆత్మహత్య.. పెళ్లి చేసుకున్నవాడే కాలయముడై.. ?
అంతా బావుంది.. హీరోయిన్స్ కోసం వేట జరుగుతుంది. ఆ హీరోయిన్ కూతురు.. ఈ హీరోయిన్ కూతురు అంటూ టాక్ నడుస్తోంది అనుకొనే టైమ్ లో ఒక పెద్ద బాంబ్ పడింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ నుంచి ప్రశాంత్ వర్మను తప్పించారని పుకారు .. సోషల్ మీడియా షికారు చేయడం.. అదంతా దావానంలా వ్యాపించడం నిమిషాల్లో జరిగిపోయింది. ప్రశాంత్ వర్మకు డైరెక్షన్ చేయడం ఇష్టం లేదని, కథ మాత్రమే ఇస్తానని బాలయ్యతో చెప్పాడని, దానికి భారీగా పారితోషికం డిమాండ్ చేసాడని టాక్.
ఇక ఈ మాట విని బాలయ్య ఫైర్ అయ్యి.. మొత్తానికి ప్రశాంత్ ను పక్కన పెట్టాడని మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక్కటే కాకుండా బాలయ్య – ప్రశాంత్ మధ్య కొన్ని విభేదాలు కూడా ఉన్నాయని, దానివలనే ప్రశాంత్ వర్మ బయటకు వచ్చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ స్థానాన్ని నాగ్ అశ్విన్ భర్తీ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై ఎట్టకేలకు మేకర్స్ స్పందించాడు.
Game Changer: ధోప్.. ధోప్ ప్రోమో.. శంకర్ మార్క్ కనిపిస్తుందిగా
“ప్రశాంత్ వర్మ – మోక్షజ్ఞ సినిమాపై వస్తున్న పుకార్లు మా వద్దకు వచ్చాయి. ఇటీవలి ఊహాగానాలను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని నిరాధారమైన పుకార్లు వ్యాపించాయి. అవి నిజం కాదని మేము మీకు హామీ ఇస్తున్నాము. ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని అధికారిక ప్రకటనలు లేదా అప్‌డేట్‌లు మా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ @SLVCinemas Offl, LegendProdOffl ద్వారా తెలియజేస్తాం. అప్పటి వరకు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని మేము పబ్లిక్ మరియు మీడియాను దయతో అభ్యర్థిస్తున్నాము. మీ సపోర్ట్ కు ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లే. సింబా ఆగలేదని తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నందమూరి వారసుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
AN IMPORTANT ALERT about our Next @PrasanthVarma – @MokshNandamuri Project.
Please stop spreading fake news. All official information will come through official channels only.#PVCU2#MTejeswiniNandamuri @sudhakarcheruk5 @SLVCinemasOffl @ThePVCU pic.twitter.com/OoLD9ridTq
— Legend Productions (@LegendProdOffl) December 18, 2024