Nidhi Agarwal: ది రాజా సాబ్, హరిహర వీరమల్లు వంటి రెండు భారీ సినిమాలతో మన ముందుకు రాబోతుంది హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal). అయితే గత కొద్దిరోజుల నుండి ఈ హీరోయిన్ కి సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు లేవు. దాంతో ఇండస్ట్రీకి కొంత గ్యాప్ వచ్చింది అని, సినిమాల్లో హీరోయిన్ గా ఈమెను ఎవరూ తీసుకోవడం లేదని,ఈమె క్రేజ్ ఇండస్ట్రీలో పడిపోయింది అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంపై అలాగే గ్యాప్ రావడం పై స్పందించింది నిధి అగర్వాల్. మరి నిధి అగర్వాల్ కి టాలీవుడ్ సినిమాల్లో ఆఫర్స్ రావడం లేదా.. ? ఆమెను డైరెక్టర్లు పట్టించుకోవడం లేదా..? ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిందా ? లేక గ్యాప్ వచ్చిందా..? అసలు కారణం ఏంటి ? అనేది ఇప్పుడు చూద్దాం..
కరోనా వల్లే సినిమా షూటింగ్ ఆగిపోయింది..
నిధి అగర్వాల్ ‘మున్నా మైఖేల్’ సినిమా ద్వారా బాలీవుడ్లోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.ఆ తర్వాత తెలుగులో నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా చేసిన ‘సవ్యసాచి’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాతో నిధి అగర్వాల్ కి గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో నిధి అగర్వాల్ కి ఇండస్ట్రీలో ఇస్మార్ట్ బ్యూటీ గా పేరు కూడా వచ్చింది. దాంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ లో నటించే అవకాశం వచ్చింది. కరోనాకి ముందే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని అనుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ ని సెలెక్ట్ కూడా చేశారు. అయితే కరోనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమేర షూటింగ్ చేశాక, సెకండ్ వేవ్ రావడంతో షూటింగ్ ఆపేశారు. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ మూవీ మార్చి 28న విడుదల కాబోతోంది.
హరిహర వీరమల్లు ఒప్పందంతోనే ఇంకో సినిమా చేయలేదు..
అయితే తాజాగా నిధి అగర్వాల్ తనకు ఇండస్ట్రీలో గ్యాప్ రావడం గురించి మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీలో గ్యాప్ తీసుకోలేదు. గ్యాప్ వచ్చింది అంతే.. ఎందుకంటే ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టు ఒప్పుకున్న సమయంలో వేరే సినిమాకి కమిట్మెంట్ ఇవ్వద్దు అని చిత్ర యూనిట్ నాకు చెప్పింది. దాంతో నేను అవకాశాలు వచ్చినా సైలెంట్ గా ఉన్నాను. కానీ మొదటిసారి ప్రభాస్(Prabhas ) హీరోగా చేస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీలో అవకాశం వచ్చింది అని తెలియగానే సైలెంట్ గా ఉండలేకపోయాను. దాంతో వెంటనే ఈ విషయాన్ని హరిహర వీరమల్లు మూవీ మేకర్స్ కి చెప్పగా.. వాళ్లు ప్రభాస్ మూవీ లో నటించడానికి ఒప్పుకున్నారు. ఇక వారి అంగీకారంతో ది రాజా సాబ్ మూవీకి ఓకే చెప్పాను.
అలా రెండు భారీ సినిమాలు నా చేతిలో ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది.ఇవి రెండు హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను” అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
బరువు పెరగడంపై స్పందించిన హీరోయిన్..
అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధ పడడం కంటే ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నాను అంటూ చెప్పింది నిధి అగర్వాల్. అలాగే ఒకప్పుడు సన్నగా మెరుపుతీగలా ఉండే నిధి అగర్వాల్..ఇప్పుడు బొద్దుగా ఎందుకు మారింది? అని చాలామందిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా ఆమె స్పందిస్తూ.. “మొదట నేను సన్నగా ఉన్న సమయంలో చాలామంది నన్ను చూసి కాస్త లావవ్వు బాగుంటావు అని అన్నారు. కానీ కరోనా టైంలో ఆ ఫుడ్ ఈ ఫుడ్ తిని కాస్త బరువు పెరిగాక, ఇదేంటి ఇంతలావు అయిపోయావు అని వాళ్లే మళ్ళీ నన్ను విమర్శిస్తున్నారు”.. అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఇక నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ కాంబోలో హరిహర వీరమల్లు రాబోతోంది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుంది.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య సమర యోధుడడిగా కనిపిస్తారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణలు డైరెక్షన్ చేసిన ఈ సినిమా నుండి క్రిష్ జాగర్లమూడి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఈ సినిమాకి డైరెక్షన్ అందిస్తున్నారు. అలాగే మారుతి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతున్న ది రాజా సాబ్ మూవీలో కూడా ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్,రిద్ధి కుమార్ లు కూడా నటిస్తున్నారు. గత కొద్ది రోజుల నుండి నయనతార కూడా ఈ సినిమాలో భాగం కానుంది అనే రూమర్ వినిపిస్తోంది.