Group Syllabus Interview: రీసెంట్‌గా గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను రేవంత్ సర్కార్ సజావుగా నిర్వహించింది. పేపర్ లీక్, ఎలాంటి అవకతవకలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహించింది. మూడు రోజుల క్రితం గ్రూప్-3 కీని కూడా టీజీపీఎస్సీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. రేపు, ఎల్లుండో గ్రూప్-2 కీని కూడా టీజీపీఎస్సీ అందుబాటులోకి తేనుంది. అయితే టీజీపీఎస్సీ చైర్మన్ మార్చ్ 31 లోగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించారు. మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
అయితే.. ఛైర్మన్ మాట్లాడుతూ.. గ్రూప్స్ పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు ఎగ్జామ్ సెలబస్ గురించి చర్చించుకుంటున్నారు. గ్రూప్స్ పరీక్షల్లో సంస్కరణలు చేపట్టనున్నారా? పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మారనుందా..? కొన్ని అంశాలను తొలగించనున్నారా..? గ్రూప్-1, గ్రూప్-2లో మళ్లీ ఇంటర్వ్యూ విధానం తీసుకురానున్నారా? అంటే.. అవుననే సంకేతాలు ఎక్కువగా వినబడుతున్నాయి. సిలబస్ సహా పరీక్షల విధానంపైనా టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం.
విద్యాధికారులు మళ్లీ గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు ఇంటర్వ్యూలు పెడితే ఎలా ఉంటుందనే అంశాన్ని సైతం అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, పోటీ పరీక్షల సిలబస్‌ను 2015లో ఖరారు చేశారు. 2016లో మొదటి సారి గ్రూప్-2 పరీక్షను నిర్వహించారు. అప్పుడు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూకి 1:3 నిష్పత్తిలో పిలిచారు. అప్పట్లో 25 మంది విషయ నిపుణులతో టీజీపీఎస్సీ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కమిటీ పలు అంశాలపై కూలంకశంగా చర్చించి పలు సిఫారసులు చేసింది. అప్పటి నుంచి ఇదే విధానం అమలవుతుండగా, తాజాగా సిలబస్‌ను మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
Also Read: NPCIL Jobs: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.. లాస్ట్ డేట్ ఇదే..
అయితే.. సిలబస్‌లో కొన్ని అంశాలను తొలిగిస్తే అభ్యర్థులకు లాభం చేకూరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. గ్రూప్-2 పరీక్షలను నాలుగు పేపర్లు కాకుండా రెండు, మూడు పేపర్లకు కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిలబస్‌ను కుదించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. లెంగ్త్ ఉన్న సిలబస్ ను కుదించి అభ్యర్థులకు అందజేస్తే చదవడానికి ఈజీ అవుతోందనే ఉద్దేశ్యంతో అధికారులు సెలబస్‌లో మార్పుల చేస్తున్నట్లు తెలుస్తోంది. సిలబస్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.. కానీ కొంచె సిలబస్‌ను తగ్గించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఇంటర్వ్యూపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే సమాచారం. అయితే ఇంటర్వ్యూ ఉంటే ఇబ్బంది అవుతోందని చాలా మంది అభ్యర్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూ లేకుండా గ్రూప్స్ పరీక్షలను నిర్వహించడం మేలు అని చాలా మంది అభ్యర్థులు చెబుతున్నారు. మరి టీజీపీఎస్సీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.