EntertainmentPin

Niharika-Chaitanya: నిహారిక విడాకులు?.. ఇన్‌స్టాలో ఫొటోలు డిలీట్…

Niharika-Chaitanya: నటుడు నాగబాబు ముద్దుల కూతురు నిహారిక, బిజినెస్‌మ్యాన్ చైతన్య దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్వీట్ కపుల్స్‌లో ఈ జంట ఒకటి. 2020 డిసెంబర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత వెకేషన్స్, పార్టీలంటూ ఫుల్‌గా తిరుగుతూ తెగ ఎంజాయ్ చేశారు ఈ కపుల్. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. వారి ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరించేవారు.

ఇక వాళ్లిద్దరికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. త్వరలో నిహారిక, చైతన్య విడాకులు తీసుకొని విడిపోబోతున్నారట. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేసి.. సింగిల్‌గా ఫొటోలు పెట్టడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. అలాగే చైతన్య తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలను డిలీట్ చేశాడు.

దీంతో మెగాఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. వారిద్దరి మధ్య మనస్పర్థాలు వచ్చాయని అందకే విడిపోతున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఇండిస్ట్రీలో పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకు విడిపోవడం కామన్ అయిపోయింది. ఇటీవల నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సమయంలో కూడా ఇలానే జరిగింది. విడాకులు తీసుకునే ముందు సామ్, చై ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అలాగే ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను కూడా రిమూవ్ చేశారు.

ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని, త్వరలోనే నిహారిక, చైతన్య విడాకులు తీసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వార్తలపై నిహారిక, చైతన్య, మెగా ఫ్యామిలీ ఎవరూ స్పందించలేదు. ఈ వార్తలకు బ్రేక్ పడాలన్నా.. క్లారిటీ రావాలన్నా వారిలో ఎవరైనా స్పందించాల్సిందే.

Related posts

Aamir Khan : NTR 31లో విల‌న్‌గా బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌..!

Bigtv Digital

MI VS KKR:- స్కై మెరుపులు.. రఫ్ఫాడించిన ఇషాన్.. ముంబైకి మరో గెలుపు..

Bigtv Digital

Revanth Reddy : రైతులకు రేవంత్ బహిరంగ లేఖ.. ఆ అంశాలపై కేసీఆర్ ను ప్రశ్నించాలని పిలుపు..

Bigtv Digital

Leave a Comment