Niharika Konidela: ఎన్నికలు అయ్యాయి.. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఎవరికి వారు తమ పనుల్లో బిజీగా మారారు.. కానీ, ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ చేసిన పనిని మాత్రం నెటిజన్స్ అస్సలు మర్చిపోవడం లేదు. మెగా ఫ్యామిలీలో కానీ, అల్లు ఫ్యామిలీలో కానీ ఎవరు కనిపించినా ఈ ప్రశ్నను అడగడం మాత్రం మర్చిపోవడం లేదు.
తాజాగా నిహారిక కొణిదెలకు ఇదే ప్రశ్న ఎదురయ్యింది. ప్రస్తుతం మీ నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు అనే సినిమా తెరకెక్కింది. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నిహారికనే అన్ని ప్రమోషన్స్ లో కనిపిస్తూ సినిమాపై హైప్ పెంచుతుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన గురించి ప్రశ్న ఎదురయ్యింది. అందరు ఒక వైపు.. అల్లు అర్జున్ మరొక వైపు.. అప్పట్లో మీ నాన్నగారు నాగబాబు కూడా దీని గురించి ట్వీట్ చేశారు. ఈ విషయమై ఇంట్లో ఎలాంటి చర్చలు జరిగాయి అన్న ప్రశ్నకు నిహారిక మాట్లాడుతూ.. ” ఇంట్లో దీని గురించి ఇంట్లో ఎక్కువ మాట్లాడుకోలేదు. నాన్న ట్వీట్ దేని గురించి పెట్టారు అన్నది తెలియదు. ఆయన సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. ఏ విషయమై ఆ ట్వీట్ పెట్టారు అన్నది నాకు తెలియదు.
ఇంట్లో ఎప్పుడు ఈ టాపిక్ రాలేదు. వారు ఏం చెప్పారంటే.. వాళ్లు ఏం చేయాలనుకున్నా వాళ్ళకంటూ కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఇలా చేశారు కాబట్టి.. అందరూ కలిసి ఉండాలి అని లేదు. రాజకీయ పరంగా, మతపరంగా, ఆత్మపరముగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే వారు చేస్తారు” అని చెప్పుకొచ్చింది. అంటే.. అల్లు అర్జున్ కు ఏది నచ్చిందో అదే చేశాడు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా ఈ గొడవ ఆగుతుందేమో చూడాలి.
Niharika about Bunny Nandyal Visit ! pic.twitter.com/Q6qqsoIrcK
— Bunny Akash🪓 (@BunnyAkash19) July 30, 2024