E-Paper
Advertisement

Swayambhu: ‘స్వయంభు’లో ఒక్క వార్ ఎపిసోడ్‌కు రూ.8 కోట్లు.. 700 మంది ఆర్టిస్టులు.. కొత్త పోస్టర్ అదుర్స్

Swayambhu: ‘స్వయంభు’లో ఒక్క వార్ ఎపిసోడ్‌కు రూ.8 కోట్లు.. 700 మంది ఆర్టిస్టులు.. కొత్త పోస్టర్ అదుర్స్
Advertisement

Nikhil – Swayambhu Update: ప్రతి ఒక్క నటుడికి ఏదో ఒక సినిమా లైఫ్‌ ఇస్తుంది. అప్పటి వరకు చిన్నా చితక సినిమాలతో ఆడియన్స్‌ను అలరించిన నటులు కూడా ఓవర్‌నైట్‌లో క్రేజీ హీరోగా మారిపోతారు. అలాంటి ఒక సినిమా యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌ను మార్చేసింది. ఎంతో కాలంగా చిన్న చిన్న సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్ని అలరించిన నిఖిల్ ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు.

అయితే ఆ సినిమా మరెదో కాదు. ‘కార్తికేయ’. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌తో సూపర్ రెస్పాన్స్‌ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో ఈ మూవీ మంచి హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా సీక్వెల్‌ను రూపొందించారు.

Advertisement

‘కార్తికేయ 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో దుమ్ము దులిపేసింది. ఈ మూవీతో నిఖిల్ పేరు వరల్డ్ వైడ్‌గా మారుమోగిపోయింది. కలెక్షన్లు అయితే మామూలుగా రాలేదు. బాక్సాఫీసు వద్ద దండయాత్రే జరిగింది. మరి అంతటి పెద్ద హిట్‌ను అందుకున్న నిఖిల్ ఇప్పుడు మరొక భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో భాగంగానే భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభు’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ నిఖిల్ కెరీర్‌లో 20వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇందులో నిఖిల్ ఒక యోధుడి పాత్రలో నటిస్తున్నాడు.

Also Read: నిఖిల్ ‘స్వయంభు’లోకి ఇస్మార్ట్ బ్యూటీ.. యువరాణిగా ఫస్ట్ లుక్..!

Advertisement

ఈ మూవీ కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నాడు. యుద్ధ విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్‌‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ నిఖిల్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుందట.

అయితే ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు రూ.8 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్ సుమారు 700 మంది జూనియర్ ఆర్టిస్టులతో సహా స్టార్ నటీ నటులపై 12 రోజుల పాటు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో మేజర్ సీక్వెన్స్‌లో ఇది కూడా ఒకటన అంటున్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను పంచుకుంది. అందులో నిఖిల్ వేల మంది జనాల మధ్య నిల్చుని ఉన్నాడు. దీని బట్టి చూస్తే.. అతడు ఓ యాక్షన్ కోసం రంగం లోకి దిగినట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్తో అంచనాలు రెట్టింపయ్యాయి. కాగా ఈ మూవీలో ఇద్దరు నటీమణులు ఎంపిక అయ్యారు. అందులో సంయుక్తా మీనన్ ఒకరు కాగా.. మరొకరు నభా నటేష్. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×