E-Paper
Advertisement

Nithin : తన మూవీ ప్రమోషన్ కోసం నాగవంశీని లాక్ చేసిన నితిన్..

Nithin : తన మూవీ ప్రమోషన్ కోసం నాగవంశీని లాక్ చేసిన నితిన్..
Nithin

Nithin : నితిన్ , వక్కంతం వంశీ కాంబో లో శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ ఎక్స్ట్రార్డినరీ మాన్.ఈ హిలేరియస్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ మూవీ డిసెంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ,సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. ట్రైలర్ లో బ్యాక్ టు బ్యాక్ కామెడీ డైలాగ్స్ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా మూవీ పై అంచనాలను కూడా భారీగా పెంచుతున్నాయి.

అవుట్ అండ్ అవుట్ కామెడీలో నితిన్ బ్రహ్మాండంగా మెప్పిస్తాడు అన్న విషయం తెలిసిందే. తిరిగి మళ్లీ అదే టైప్ కామెడీతో నితిన్ ఈ మూవీ తో వస్తున్నాడు అన్న విషయం ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. మూవీ ప్రమోషన్స్ లో హీరో నితిన్ జోరుగా పాటిస్పేట్ చేయడమే కాకుండా.. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. కథ కొద్ది కాలంగా కమర్షియల్ కామెడీకి ఆడియన్స్ ఎక్కువగా ఓటేస్తున్నారు. దీంతో ఈ మూవీ సక్సెస్ పై చిత్ర బృందం కాన్ఫిడెంట్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది.

రీసెంట్ గా ఇదే తరహా కామెడీతో వచ్చిన మ్యాడ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక ఏ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రొడ్యూసర్ నాగవంశీ ..మ్యాడ్ మూవీ చూసి నవ్వకుండా బయటకొస్తే టికెట్ డబ్బులు వాపసిస్తానని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. ప్రొడ్యూసర్ చేసిన ఈ ఛాలెంజ్ ఇన్ డైరెక్ట్ గా ఈ మూవీకి ఆడియన్స్ పెరగడంలో హెల్ప్ చేసింది. ఇది ఒక తరహా ప్రమోషన్ ట్రిక్ అని అప్పట్లో అన్నారు కూడా. మరి నితిన్ కూడా అదే తరహా తన సరికొత్త మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కి ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది.

నితిన్ లో హ్యూమర్ యాంగిల్ ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. తన తరహా పంచ్ డైలాగ్స్ తో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో అందరినీ నవ్విస్తూ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు నితిన్. ఈ సందర్భంగా మూవీ గురించి మాట్లాడుతూ.. తన మాదిరిగానే మూవీ కూడా అందరినీ ఆద్యంతం నవ్విస్తుందని.. థియేటర్లో ప్రేక్షకులు సినిమా మొత్తం ఆస్వాదిస్తారని అన్నాడు. 

అంతటితో సరిపెట్టుకోకుండా తన సినిమా నుంచి ఎవరైనా నవ్వకుండా బయటికి వస్తే.. టికెట్ డబ్బులు నాగ వంశీ వాపస్ ఇస్తారని.. నాకు.. అతనికి మధ్య పాత లావాదేవీలు ఉన్నాయి.. అని అన్నాడు.దీనిపై స్పందించిన నాగ వంశీ.. అప్పుడేదో సినిమా మూడ్ లో ఉండి అలా అన్నాను అంత మాత్రం నన్ను ఇలా లాక్ చేస్తే ఎలా అంటూ ఓ ఏమోజి కూడా జత చేసి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్రీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×