BigTV English

Nithya Menon: ఎట్టకేలకు 36 యేళ్ళ వయసులో పెళ్లి పీటలెక్కనున్న నిత్యా మీనన్.. !

Nithya Menon: ఎట్టకేలకు 36 యేళ్ళ వయసులో పెళ్లి పీటలెక్కనున్న నిత్యా మీనన్.. !

Nithya Menon.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ (Nithya Menon) తాజాగా బ్యాచిలర్ లైఫ్ ను వీడి పెళ్లి పీటలు ఎక్కబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా మంచి పేరు సొంతం చేసుకుంది నిత్యామీనన్.అందం, అభినయంతో నటనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. నాచురల్ స్టార్ హీరో నాని హీరోగా నటించిన అలా మొదలైంది అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలు దోచుకున్న ఈమె సింగర్ గా కూడా తనలోని ప్రతిభను చాటుకుంది.


హీరోయిన్ గానే కాదు సింగర్ గా కూడా..

సినిమాల్లో కూడా కొన్ని పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగుతో పాటు తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. కన్నడ, తమిళ్ , మలయాళం భాషలలో సుమారు 50 కి పైగా చిత్రాలలో నటించిన ఈమె అలా మొదలైంది తర్వాత సెగ , 180 వంటి చిత్రాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో గుండెజారి గల్లంతయిందే సినిమాతో మరో విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే చివరిగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) అనే సినిమాలో నటించింది.


ఒక్క సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు..

ఇదిలా ఉండగా తాజాగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ధనుష్(Dhanush ) తో కలిసి ఈమె నటించిన తిరు (Thiru ) సినిమాకి గానూ ఉత్తమ నటి కేటగిరీలో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ప్రకారం తమిళ స్టార్ హీరోని వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా నిత్యమీనన్ పెళ్లికి సంబంధించి ఇలాంటి ఎన్నో వార్తలు వచ్చినా.. అందులో ఏవి కూడా నిజం కాలేదు. ఇప్పుడు మళ్లీ పెళ్లి టాపిక్ రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి పీటలు ఎక్కనున్న నిత్యమీనన్..

ఇకపోతే త్వరలోనే నిత్యామీనన్ పెళ్లి గురించి అని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిత్యా మీనన్ వివాహం చేసుకోబోయే ఆ స్టార్ హీరో ఎవరు అన్నది మాత్రం తెలియలేదు. ఏదేమైనా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఇప్పుడు 36 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమవుతుందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎప్పటిలాగే ఇది రూమర్ గానే మిగిలిపోతుందా లేక నిజమై ఆమె వివాహం చేసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా నిత్యామీనన్ పెళ్లి పీటలు ఎక్కితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై నిత్యామీనన్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×