BigTV English

Jharkhand Crime News : దారుణం.. భార్య, పిల్లల్ని గొడ్డలితో నరికి చంపిన కర్కశుడు

Jharkhand Crime News : దారుణం.. భార్య, పిల్లల్ని గొడ్డలితో నరికి చంపిన కర్కశుడు

Triple Murder in Jharkhand : ఝార్ఖండ్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ కూతుళ్లను కర్కశంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఫాసిల్ పీఎస్ పరిధిలోని లుద్రాబాసా గ్రామంలో సోమవారం – మంగళ అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. గురుచరణ్ పాడియా తన భార్య జానో, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తున్నాడు. ఫుల్లుగా మద్యానికి బానిసైన గురుచరణ్.. తాగివచ్చి తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు.


ఏప్రిల్ 16.. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చిన గురుచరణ్.. భార్య జానోతో గొడవపడ్డాడు. వీరిద్దరి గొడవ పెరిగి పెద్దవ్వడంతో.. గురుచరణ్ సహనం కోల్పోయి గొడ్డలితో దాడి చేశాడు. గదిలో నిద్రిస్తున్న పెద్దకూతురు తల్లి అరుపులు విని వచ్చి చూసింది. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి.. బిగ్గరగా కేకలు పెట్టడంతో కూతురిపై కూడా గొడ్డలితో దాడి చేశాడు.

Also Read : ఎన్నికల వేళ.. నెత్తురోడుతున్న దండకారణ్యం..


Murdered with Axe
Murdered with Axe

ఆపై పక్కగదిలో నిద్రిస్తున్న చిన్నకూతురిపై కూడా గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత ఆ ముగ్గురి మృతదేహాల పక్కనే పడుకున్నాడు. ఇంతలో ఆ ఇంటి నుంచి అరుపులు రావడాన్ని గమనించిన ఇరుగు పొరుగువారు.. అనుమానంతో ఇంటి దగ్గరికి వెళ్లి చూశారు. తల్లీ, కూతుళ్లు రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని నిందితుడు గురుచరణ్ పాడియాను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించి.. గురుచరణ్ ను జైలుకు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు.

Tags

Related News

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Big Stories

×