BigTV English

Nithin: ‘రాబిన్‌హుడ్’ కోసం రామ్-లక్ష్మణ్‌లు.. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్

Nithin: ‘రాబిన్‌హుడ్’ కోసం రామ్-లక్ష్మణ్‌లు.. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్


Robinhood – Nithin: టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం భారీ హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఈ హీరోకి హిట్టు పడి చాలా కాలమే అయింది. అందువల్ల ఇప్పుడు మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇటీవలే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ మూవీపై మంచి అంచనాలు మొదటి నుంచి ఉండగా.. రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ అనుకున్నంత స్థాయిలో అందలేదు. దీంతో ఈ మూవీ థియేటర్ వద్ద ఫ్లాపుగా మిగిలింది.


ఇక ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుములతో చేతులు కలిపాడు. ఇక వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన ‘భీష్మ’ మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

READ MORE: పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్ రెజీనా.. వరుడు ఎవరంటే

దీంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌ రిపీట్ కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ మూవీకి గానూ ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్ సినీ ప్రియుల్లో ఫుల్ ఉత్సాహాన్ని నింపాయి.

ఇందులో నితిన్ ఓ దొంగగా కనిపించబోతున్నట్లు ఆ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఒక్క గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ బయటకొచ్చింది.

‘రాబిన్ హుడ్’ మూవీ యూనిట్ తాజాగా ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్‌ను స్టార్ట్ చేసింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం చిత్రబృందం ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లను రంగంలోకి దించింది. ప్రతి సినిమాలో తమ మార్క్ చూపించే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు ఈ మూవీని ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు.

READ MORE: 14 ఏళ్లుగా ప్రేమాయణం.. ప్రియుడ్ని నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్

ముఖ్యంగా ఇంటర్వెల్ రానున్న ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ మూవీకే హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఈ మూవీ నితిన్ కెరీర్‌ను మారుస్తుందా? లేదా అని. ఇకపోతే ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×