BIG BREAKING: మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కుండ్మాల సమీపంలో ఇంద్రాయణి నదిపై ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు మృతిచెందగా.. 25 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Snake News: వర్షాకాలం జాగ్రత్త.. మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే పాములకు వణుకు పుట్టాల్సిందే!
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూణె జిల్లాలోని ఇంద్రాయణి నదిపై కుందుమాలా పర్యాటక ప్రాంతం ఫేమస్. ఈ రోజు ఆదివారం కావడంతో.. పర్యాటకులు కుందుమలాకు పోటెత్తారు. అయితే అక్కడనున్న ఇనుప వెంతెనపై చాలా మంత్రి నిలబడ్డారు. దీంతో వెయిట్ ఎక్కువ కావడంతో వంతెన కొంత భాగం కూలిపోయింది. దీంతో చాలా మంది నదిలో కొట్టుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. స్థానిక పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. కొంతమందిని రక్షించినప్పటికీ పలువురి జాడ ఇంకా తెలియరాలేదు.
VIDEO | Indrayani Bridge Collapse: Rescue operation continues Pune's Maval tehsil where an iron bridge collapsed earlier today, leading to the death of at least two people.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/bMZd5AT88B
— Press Trust of India (@PTI_News) June 15, 2025
ఇంద్రాయణి రివర్ పై 30 ఏళ్ల క్రితం ఇనుప వంతెనను నిర్మించినట్టు స్థానిక ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై కాలినడక మార్గం కూడా ఉంటుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై దాదాపు వంద మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో అనేక మంది ఒడ్డుకు చేరుకున్నప్పటికీ పలువురు గల్లంతయ్యారు. అయితే గత రెండు రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. పూణేతో పాటు, పింప్రి, చించ్వాడ్, తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. భారత్ వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది.
రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వర్షాలు భారీగా పడుతున్న క్రమంలో కొన్ని రోజుల పాటు పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడమే మంచిదంటున్నారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.