BigTV English
Advertisement

Dil Raju : ఫేక్ ప్రచారాలు వద్దు… సీఎంతో మీటింగ్‌పై మరోసారి స్పందించిన నిర్మాత..

Dil Raju : ఫేక్ ప్రచారాలు వద్దు… సీఎంతో మీటింగ్‌పై మరోసారి స్పందించిన నిర్మాత..

Dil Raju : తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజుతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బెనిఫిట్ షోలు రద్దు చేయడంతో పాటు పలు అంశాలపై ఇందులో చర్చించారు.. ఈ మీటింగ్ పై ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి విషయాలను సీఎం తో చర్చిస్తారు అనే టాపిక్ పై ఆసక్తిగా మారింది. ఈ మీటింగ్ గురించి ఇండస్ట్రీలో పెద్దలు బయట పెట్టక పోవడంతో పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. తాజాగా ఆ రూమర్స్ కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. అసలు ఎటువంటి అంశాల పై చర్చించారో క్లారిటీ ఇచ్చారు..


సీఎం తో భేటీ అనంతరం దిల్ రాజు ఏం చెప్పారంటే..? 

నేడు సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మీటింగ్ గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ అవుతున్నాయి. దాంతో ఆ విషయాల పై ఏం మాట్లాడారన్నది క్లారిటీ ఇచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారన్నారు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు. మీడియాతో మాట్లాడిన దిల్ రాజు… సీఏంతో మీటింగ్ చాలా బాగా జరిగిందని చెప్పారు. ఈ మీటింగ్ లో ఎవరి గురించి కానీ, సినిమాల గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడలేదని అన్నారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల పెంపు తమకు ముఖ్యం కాదని చెప్పారు. బెనిఫిట్ షోలు లేదా టిక్కెట్ల పెంపుదల గురించి కాకుండా అనేక ఇతర సమస్యలను ముందుగా పరిష్కరించాల్సి ఉందని దిల్ రాజు అన్నారు.. అలాగే పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు ప్రదర్శించలేదని అన్నారు. అలాగే బౌన్సర్స్ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు ప్రతిదీ అకౌంట్ బిలిటీగా ఉండాలి అని డీజీపీ సూచించారు.. ఇక హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమాల షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దాం అని అన్నారని అన్నారు. హైదరాబాద్ కు ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమకూడా అంతే కీలకం గా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు. సామాజిక సేవ కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.. అలాగే గద్దర్ అవార్డ్స్ ను FDC తో అనుసంధానంగా జరగాలి అని చెప్పారు..


అదే విధంగా ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ సమాజానికి పనికి వచ్చే కార్యక్రమాలల్లో కలిసి పని చేస్తాయని చెప్పారు. ఇండస్ట్రీ, ఎఫ్‌డీసీ, ప్రభుత్వం కలిపి ఒక కమిటీ వేస్తారని.. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం ఉంటుందని అన్నారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు. అలాగే డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని.. ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ గా తాను బాధ్యతలు తీసుకుని వారం రోజులు అయ్యిందని.. ఇండస్ట్రీ అభివృద్ధి మాత్రమే ఇక్కడ విషయమని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడం అనేది అజెండా అని దిల్ రాజు తెలిపారు. ఇవాళ సీఏం తో జరిగిన మీటింగ్ ఈ అంశాల గుంరించే చర్చించినట్లు దిల్ రాజు సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు…

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×