Kadapa District News: ఇటీవల కాలంలో మహిళలపై వేధింపులు కేసులు పెరిగిపోతున్నాయి. కొందరు కిరాతకులు మహిళలను టార్గెట్ చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న సీఐ డ్రైవర్‌పై కేసు నమోదైంది.
also read: కేటీఆర్.. ఇలా ఇరుక్కున్నారేంటీ? బయటపడటం కష్టమేనా?
కడప జిల్లాలో కొండాపురం పోలీస్ స్టేషన్ సీఐ డ్రైవర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. కొండాపూర్ పీఎస్ సీఐ డ్రైవర్ కొంతకాలంగా ఫోన్లో లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన పర్సనల్ ఫోటోలను బయటపెడతానని సీఐ డ్రైవర్ రాముడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే రూ.50వేలు ఇవ్వకపోతే పర్సనల్ ఫోటోలను బయటపెడతానంటున్నాడని వాపోయింది. డ్రైవర్ రాముడు ద్వారా తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపింది. దీంతో డ్రైవర్ రాముడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.