AP Govt: ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందంతా మంచి కాలమేనంటూ విద్యార్థుల కోసం ముందడుగు వేస్తోంది. ఇంతకు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం చెప్పిన ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందాం.
ఏపీ పాఠశాల విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ భాద్యతలు చేపట్టిన సమయం నుండి విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చారని చెప్పవచ్చు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొనేందుకు ఇటీవల పెద్ద పండుగ పేరిట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని చెప్పవచ్చు. దాతలు కూడా స్పందించి, పాఠశాల అభివృద్దికి విరాళాలు కూడా ప్రకటించారు. ఇలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా వేసిన తొలిఅడుగు సక్సెస్ కావడంతో లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు విద్యా భోదన, సామాజిక అంశాలు, చెడు అలవాట్ల నివారణ, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై ఆధ్యాత్మిక ప్రసంగీకులు చాగంటి కోటేశ్వరరావు సేవలను కూడా ప్రభుత్వం వినియోగించుకోనుంది. విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పిల్లల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా విద్యాశాఖలో సంస్కరణలకు మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరచే విధంగా రాబోయే 6 నెలల్లో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా మంత్రి లోకేశ్ అధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం రోజునే 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర’ కిట్లను అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు అందజేయనున్నారు.
Also Read: YCP on TDP Alliance: మీ అంతుచూస్తాం.. వాళ్లు మళ్లీ నోటికి పని చెబుతున్నారు
బడుల స్టార్ రేటింగ్‌ను మెరుగుపరచేందుకు పాఠశాలల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు ఆటలకు సంబంధించిన సామగ్రిని అందించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లోనూ కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటికీ అనుసంధానంగా వన్ స్కూల్ – వన్ యాప్ పేరిట డ్యాష్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నిర్ణయాలతో పాఠశాలలు బలోపేతమై, నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని చెప్పవచ్చు.