BigTV English

Pushpa 2 Movie : వేర్ ఈజ్ పుష్పా… దీనికి వేర్ ఈజ్ ఆన్సర్ సుక్కు

Pushpa 2 Movie : వేర్ ఈజ్ పుష్పా… దీనికి వేర్ ఈజ్ ఆన్సర్ సుక్కు

Pushpa 2 Movie : పుష్ప పార్ట్ 1 విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత నార్త్‌లో రిలీజ్. అక్కడ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల నుంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక నెక్ట్స్ అందరూ ఎదురుచూసింది పుష్ప పార్ట్ 2.


అలా ఎదురుచూస్తున్న టైంలో అల్లు అర్జున్ బర్త్ డే వచ్చింది. అది 2023 ఏప్రిల్ 8వ తేదీ. బన్నీ బర్త్ డే. ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 7 తేదీనే ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. అదే వేర్ ఈజ్ పుష్పా…

3 నిమిషాల 18 సెకన్లు ఉన్న ఆ వీడియో పుష్ప 2 మూవీపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసేలా చేసింది… ఆ వీడియోలో…


పుష్ప‌రాజ్‌పై పోలీసులు ప‌ది రౌండ్స్ కాల్పులు జరపడంతో, తీవ్ర గాయాల పాలు అవ్వడంతో, పుష్ప అడ‌వుల్లోకి పారిపోయాడ‌ు అంటూ న్యూస్ వస్తుంటుంది. ఆ న్యూస్ ను ప్రజలు అసలేం జరుగుతుంది అంటూ చూస్తారు. బాక్రాపేట అడవుల్లో రక్తంతో ఉన్న పుష్ప రాజ్ చొక్కా కనిపించిందని, దానికి 8 బుల్లెట్ల రంధ్రాలున్నాయని ఆ వార్తలో చెబుతారు. 8 బుల్లెట్స్ తగిలిన తర్వాత పుష్ప రాజ్ బతికే ఛాన్స్ లేదు అని అందరూ అనుకుంటారు.

ఆ టైంలోనే ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి న్యూస్ ఛానెల్‌కి వీడియో క్యాసెట్ ఇస్తాడు. ఆ వీడియోలో… అడవిలో ఓ పులి కనిపిస్తుంది. ఆ పులి ఓ వ్యక్తిని చూసి భయపడి వెనక్కి రెండు అడుగులు వేస్తుంది. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరా అని చూస్తారు. “ జంతువులు రెండు అడుగులు వెన‌క్కి వేసినాయంటే పులిచ్చొండాద‌ని అర్థం. మ‌రి పులి రెండు అడుగులు వెన‌క్కి వేసినాదంటే పుష్ప వ‌చ్చుండాడ‌ని అర్థం” అనే డైలాగ్ రావడంతో అల్లు అర్జున్ ఫేస్ రివీల్ అవుతుంది. ఈ డైలాగ్, అల్లు అర్జున్, పులి వెనక్కి అడుగు వేయడం అన్ని కూడా గూస్ బమ్స్ వచ్చేలా ఉంటాయి.

ఈ వీడియో వచ్చి ఏడాది అవుతుంది కదా… అందుకే ఒక సారి గుర్తు చేశాం. ఈ సీన్ చూడాలని అల్లు అర్జున్‌తో పాటు పుష్ప మూవీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ, అది సినిమాలో లేదు. అసలు పుష్ప రాజ్ పైన కాల్పులు జరిపే సీనే లేదు. అడవి పులి అనే కాదు. అసలు సినిమాలో ఈ పార్ట్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశలో పడిపోయారు. అంత ఎలివేషన్ ఉండే సీన్ ఎందుకు పెట్టలేదు అంటూ సుక్కుపై ఫైర్ అవుతున్నారు. ఆ సీన్ కూడా ఉంటే సినిమాపై ఇప్పుడు వస్తున్న నెగిటివిటీ కొంత మేరకు అయినా కవర్ అయ్యేది అని చెబుతున్నారు.

అలాగే, జాతర ఎపిసోడ్ బాగానే ఉన్నా… ఈ వేర్ ఈజ్ పుష్పా టీజర్ చూస్తే… అండర్ గ్రౌండ్ నుంచి పుష్ప వచ్చే సీన్‌లోనే జాతర ఎపిసోడ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, సుక్కు ఆ జాతర ఎపిసోడ్ ను అలా కాకుండా, ఎమోషనల్ టచ్ తో ఓపెన్ చేసి,  ఫ్యామిలీ టచ్ తో ముగించాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×