BigTV English

Peru President Nose: ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ప్రెసిడెంట్.. రాజీనామా డిమాండ్ చేసిన ఎంపీలు

Peru President Nose: ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ప్రెసిడెంట్.. రాజీనామా డిమాండ్ చేసిన ఎంపీలు

Peru President Nose| అందానికి ప్రాధాన్యం ఇచ్చి తన పదవి బాధ్యతలు విస్మరించిందని ఆరోపణలో ఒక దేశ అధ్యక్షురాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని కొందరు ఎంపీలైతే ఆమె ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో జరుగుతోంది.


పెరు మహిళా ప్రెసిడెంట్ డీనా బోలుఆర్టె గత ఏడాది తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారు. ఈ కారణంగా ఆమె తన దేశం పట్ల బాధ్యతలు నిర్లక్ష్యం చేసిందని విమర్శలు ఎదుర్కొంటున్నారు. మంగళవారం డిసెంబర్ 3, 2024న ఆమె అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. 62 ఏళ్ల డీనా బోలుఆర్టె 2023 సంవత్సరంలో తన ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ (రైనో ప్లాస్టీ) చేయించుకున్నారు. ఆమె సమయంలోనే ఆమెపై సోషల్ మీడియా, వార్తా పత్రికలు బాగా ట్రోల్ చేశాయి.

జూన్ 28 నుంచి జూలై 10 , 2023 వరకు డీనా బోలుఆర్టె పెరు అధ్యక్ష బాధ్యతలు వదిలి సర్జరీ చేసుకునేందుకు వెళ్లారు. అయితే అధికారికంగా ఈ సమాచారం ఆమె ఎవరికీ ఇవ్వలేదు. దీంతో ఆమె కనబడడం లేదని, చనిపోయందనే ప్రచారం వరకు సాగింది. చివరికి స్థానిక మీడియా చానెల్ ఆమె తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారని కథనం ప్రచరుంచింది. అయితే ఆమె సర్జీరీ కోసం వెళ్లినప్పుడు తన బాధ్యతలు మరొకరి అప్పగించకుండా వెళ్లడంతో ప్రభుత్వ కార్యాలయాలు స్తంభించిపోయాయి. ఇది ఆమె నిర్లక్ష్య ధోరణిని తెలియజేస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మండిపడ్డారు.


Also Read: ఫ్రాన్స్‌లో 3 నెలలకే కూలిపోయిన ప్రభుత్వం.. ప్రధాన మంత్రిగా బార్నియర్ తొలగింపు!

దీనికి తోడు తాజాగా ఆమెపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆమెపై పెరు కాంగ్రెసనల్ కమిషన్ విచారణ చేపట్టింది. ఆమె సమర్థించడానికి స్వయంగా మాజీ ప్రధాన మంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. పెరువియన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి ఆల్బెర్టో ఒటరోలా ప్రెసిడెంట్ డీనా బోలుఆర్టె ముఖానికి చేసుకున్న సర్జరీని సమర్థిస్తూ.. “నాకు ఈ విషయం ఆమె సర్జరీ చేసుకునే ముందే తెలియజేశారు. తనకు శ్వాస తీసుకోవడం సమస్య ఉందని అందుకే వైద్య పరంగా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉందని నాకు చెప్పారు. ఆమె విదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేసేవారు” అని అన్నారు.

కానీ ప్రతిపక్ష పార్టీ ఎంపీ జుఆన్ బార్గోస్ మాత్రం ఆమె కాంగ్రెస్ అనుమతి తీసుకొని వెళ్లాలి.. అయితే ఆమె అలా చేయలేదు. ఆమె నిర్లక్ష్య వైఖరి కారణంగా అధ్యక్ష పదవి నుంచి ఆమెను తొలగించాల్సిందేనని అన్నారు.

కమ్యానిస్టు భావజాలమున్న డీనా బోలుఆర్టె మార్కిస్ట్ పార్టీకి చెందినవారు. అయితే ఆమెకు ఆశ్చర్యకరంగా రైట్ వింగ్ సిద్ధాంతాలున్న పెరివియన్ కాంగ్రెస్ మద్దుతుతో అధ్యక్ష పదవి చేజిక్కించుకుంది. కొన్ని నెలల క్రితం ప్రెసిడెంట్ డీనా బోలుఆర్టెపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఆమె ఒక ప్రాజెక్టు కోసం వజ్రాలతో కూడిన రోలెక్స్ వాచీలు లంచంగా తీసుకుందని ఆరోపణలున్నాయి. దీనికి తోడు 2022 సంవత్సరంలో డీనా బోలుఆర్టెకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. ఆ సమయంలో నిరసనకారులుపై ఆమె కాల్పులు జరిపేందుకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనలో 50 మంది నిరసనకారులు చనిపోయారు.

ప్రెసిడెంట్ డీనా బోలుఆర్టె పదవికాలం 2026 వరకు ఉంది. అయితే ఆమెకు వ్యతిరేకంగా 95 శాతం రేటంగ్ ఉండడం గమనార్హం.

Related News

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Big Stories

×