RGV Tweet on MEGA : ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే. అయితే ‘పుష్ప 2’ రిలీజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తబోతున్నాయా అన్న విధంగా నడిచింది ఈ వివాదం. పలు వార్నింగ్ లు, తీవ్రమైన నెగిటివ్ కామెంట్స్ వంటి వరుస సంఘటన తర్వాత ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ అల్లు వర్సెస్ మెగా వివాదాన్ని మరింతగా రాజేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉంది.
ఇప్పటికే రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీపై నెగిటివ్ గా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. సందర్భం దొరికితే చాలు మెగా ఫ్యామిలీపై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ల వర్షం కురిపిస్తాడ. మెగా అభిమానులు ఎంత టార్గెట్ చేసినా కనీసం పట్టించుకోడు సరికదా మరో ట్వీట్ ను ఎక్కువే వేసి, వాళ్ళను మరింత ఉడికిస్తాడు. అయితే మెగా బ్రదర్స్ ఆర్జీవి ట్వీట్లపై ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులను మెగా ఫ్యామిలీ పైకి ఎగదోస్తున్నాడు. మెగా ఫ్యామిలీ పైన కోపం తీర్చుకోవడానికి అల్లు అనే పేరును, ఆయనకు ఉన్న ఆర్మీని వర్మ వాడుకుంటున్నాడు అనే విషయం ఆయన ట్వీట్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వర్మ చేసిన ట్వీట్స్ అన్నీ కూడా ఈ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉండడం గమనార్హం.
ALLU is MEGA to the power of OMEGA for creating a BOX OFFICE MANIA @alluarjun is without doubt the BIGGEST and MEGAAAEST STAR of INDIA in 101 YEARS since 1913 the year the 1st film was made in INDIA
— Ram Gopal Varma (@RGVzoomin) December 5, 2024
రీసెంట్ గా ఇడ్లీ ఉదాహరణ ద్వారా సినిమా టికెట్ రేట్లు ఇంత భారీగా పెంచడం దారుణం అంటూ విమర్శిస్తున్న వారికి గట్టిగా సమాధానం చెప్పాడు వర్మ. ఇక తాజాగా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ “పుష్ప 2 (Pushpa 2) మూవీ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్” అని కామెంట్ చేశాడు. అక్కడితో ఆగకుండా “అల్లు ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా…” అంటూ ఆ ట్వీట్ ని సాగదీశాడు. ఆ తరువాత గంటల వ్యవధిలోనే రాంగోపాల్ వర్మ చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ లో “బాక్స్ ఆఫీస్ మేనియాను క్రియేట్ చేయడంలో ఒమేగాకు అల్లు అనేది మెగా పవర్. అల్లు అర్జున్ బిగ్గెస్ట్ మెగాయిస్ట్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1913లో ఫస్ట్ సినిమా తీసినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే… 101 ఏళ్ల వరకు చూసుకుంటే ఆయనే బిగ్గెస్ట్ స్టార్” అంటూ రాసుకొచ్చారు వర్మ.
ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun) పొగడడం కంటే మెగా హీరోలపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేయడమే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఆర్జీవి ట్వీట్ లపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజెన్లు. కొంతమంది ‘ఇప్పటి వరకు ఇలాంటి యాక్టింగ్ ను ఎప్పుడూ చూడలేదు అనే విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అంటుంటే, మరి కొంతమంది మాత్రం ‘మూవీ బాగాలేదని రాంగోపాల్ వర్మ ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నాడు’ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్ లకి మెగా అభిమానులు ఫైర్ అవుతుంటే, అల్లు అభిమానులు మాత్రం సపోర్ట్ చేస్తుండడం గమనార్హం. మరి వర్మ పెట్టిన ఈ అల్లు వర్సెస్ మెగా చిచ్చు ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.