Rashmika: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరికీ తెలియదు. రాత్రికి రాత్రే కొంతమంది స్టార్ సెలబ్రిటీగా మారుతూ ఉండగా మరికొందరు ఒక్కసారిగా స్టార్ డమ్ కోల్పోయి ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. ఇలా అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో నటి రష్మిక మందన్న (Rashmika Maandanna) ఒకరు. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా వరుస పాన్ ఇండియా సినిమాలలోనూ అలాగే బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు.
ఇండస్ట్రీని ఏలుతున్న నటి..
రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కిరిక్ పార్టీ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని అనంతరం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇక తెలుగులో వరుస హిట్ సినిమాలలో నటించిన రష్మికకు పుష్ప(Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత రష్మికకు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. దీంతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీగా ఉన్నారు.
మీ ఆనందం కోసం బ్రతకండి…
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈ విషయం గురించి నాకు బాగా తెలుసు గతంలో కూడా ఇదే విషయాల గురించి చర్చించాను. ఒకరోజు బాగుంటే, మరో రోజు క్లిష్టంగా గడుస్తుంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల నుంచి సన్నిహితుల నుంచి వచ్చే మద్దతు ఎంతో ముఖ్యమని తెలిపారు.
ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతురాలిని నా జీవితంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నా కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచిందని తెలిపారు. నీ జీవితంలో నీకంటూ ఒకరోజు వస్తుంది ఆరోజు నువ్వు అనుకున్న విధంగా నీ జీవితాన్ని గడపొచ్చు. మనం ఎప్పుడూ కూడా ఇతరుల కోసం కాకుండా మనకోసం, మన ఆనందం కోసం బ్రతకడం నేర్చుకోవాలి. నేను నటి అవుతానని ఎప్పుడూ అనుకోలేదు, ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. కానీ కూర్గ్ వంటి ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో వచ్చే కఠినమైన పరిస్థితులను అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని తెలిపారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని సత్యాన్ని తెలుసుకొని జీవిస్తే జీవితం ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.