Women Fighting In Train: బస్సులు, రైళ్లలో సీట్ల కోసం ప్రయాణీకులు తరచుగా గొడవలు పడుతూనే ఉంటారు. మగవాళ్లు అయితే, కాసేపు తిట్టుకుని, లేదంటే రెండు దెబ్బలు కొట్టుకుని కూల్ అయిపోతారు. అదే మహిళలు అయితే? వామ్మో ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది. నోటికి అడ్డు ఉండదు. చేతికి అదుపు ఉండదు. జుట్లు పట్టుకుని ఊడిపోయేలా కొట్టుకుంటారు. సాధారణంగా ఇలాంటి సీన్లు ఢిల్లీ లేదంటే ముంబై మెట్రోతో పాటు ఎంఎంటీఎస్ రైళ్లలో కనిపిస్తుంటాయి. తాజాగా ఈ కొట్లాటలు కర్నాటక వరకు పాకాయి. జనరల్ బోగీలో సీట్ల కోసం ఇద్దరు మహిళల కొట్లాటకు దిగడం చూసి అందరూ షాకయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సీట్ల కోసం మహిళల కొట్లాట
తాజాగా కర్నాటక- మైసూర్ ఎక్స్ ప్రెస్ రైల్లో సీట్ల కోసం ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. జనరల్ బోగీలో జరిగిన ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. మాట మాట పెరిగి కొట్లాడుకునే స్థాయికి చేరారు. ఇద్దరూ జుట్లు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. కంపార్ట్ మెంట్ అంతా నానా రచ్చ చేశారు. కింద పడి మరీ బీభత్సంగా కొట్టుకున్నారు. ఇతర ప్రయాణీకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా, వారిని నెట్టేసి మరీ తన్నుకున్నారు. కాసేపటి తర్వాత అందరూ కలిసి మహిళలు ఇద్దరినీ విడిపించారు. ఈ ఘటనను తోటి ప్రయాణీకులు తమ సెల్ ఫోన్లలో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
కర్నాటక మైసూర్ ఎక్స్ ప్రెస్ రైలు జనరల్ బోగీల్లో పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందంటున్నారు నెటిజన్లు. అంతేకాదు, ఈ రైల్లో వీలైనన్ని ఎక్కువ జనరల్ బోగీలు పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందంటున్నారు. అటు ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఇవే!
మైసూర్ కర్ణాటక ఎక్స్ ప్రెస్ గురించి..
మైసూర్ కర్ణాటక ఎక్స్ ప్రెస్ రైలు అనేది బెంగళూరు నుంచి న్యూఢిల్లీకి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు. ఈ రైలు ప్రతి రోజు నడుస్తుంది.కర్ణాటక లోని ముఖ్య నగరాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. బెంగళూరు సిటీ జంక్షన్ (SBC) నుంచి న్యూఢిల్లీ (NDLS) కి బయల్దేరుతుంది. మూడు రోజుల పాటు ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. జనరల్ బోగీలు తక్కువగా ఉండటంతో సాధారణ ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా సీట్ల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి.
Read Also: దేశాలు, ఖండాలను కలిపే వంతెనలు.. ఈ సరిహద్దులు భలే ఉంటాయ్ బాసు!