E-Paper
Advertisement

NTR 30 : ఎన్టీఆర్ 30లో బుల్లి తెర బ్యూటీ చైత్రా రాయ్‌

NTR 30 : ఎన్టీఆర్ 30లో బుల్లి తెర బ్యూటీ చైత్రా రాయ్‌
Advertisement

NTR 30 : ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ NTR 30 కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, సైఫ్‌ల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. తాజాగా ఈ టీమ్‌లో బుల్లి తెర బ్యూటీ చైత్రా రాయ్ జాయిన్ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా తెలియ‌జేసింది.

Advertisement

రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చైత్రా రాయ్ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌, సైఫ్ అలీఖాన్‌ల‌ను సెట్స్‌లో క‌ల‌వ‌టం చాలా అదృష్టం. వారితో కలిసి నటించటం ఓవరంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. NTR 30లో సైఫ్ అలీఖాన్ భార్య పాత్రలో చైత్ర కనిపించనుంది. తెలుగు, కన్నడలో పలు సీరియల్స్ ద్వారా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్న ఈమె తెలుగులో అష్టాచమ్మా సీరియల్‌తో ప‌రిచయం అయ్యారు. అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు, దటీజ్ మహాలక్ష్మి వంటి సీరియల్స్‌లోనూ నటించారు. ఇప్పుడు రాధకు నీవేరా ప్రాణం సీరియల్‌లో నటిస్తున్నారు చైత్రా రాయ్.

RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ NTR 30 కావటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్‌ను కొరటాల మాస్ అవతార్‌లో ప్రెజంట్ చేయబోతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా జాయిన్ అయ్యారు. ప్లానింగ్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న NTR 30 రిలీజ్ కానుంది. నందమూరి కళ్యాణ్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై హరికృష్ణ.కె, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×