E-Paper
Advertisement

Tripti Dimri in War 2: ‘వార్ 2’లో ఎన్టీఆర్ కోసం రంగంలోకి ‘యానిమల్’ బ్యూటీ..?

Tripti Dimri in War 2: ‘వార్ 2’లో ఎన్టీఆర్ కోసం రంగంలోకి ‘యానిమల్’ బ్యూటీ..?
Advertisement

Tripti Dimri in War 2 Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ ‘దేవర’ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీతో పాటు మరొక హిట్ సీక్వెల్‌ మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీ ‘వార్ 2’. ఈ మూవీతో ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ తొలిసారి స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు కాబట్టి. అలాగే మరొక రీజన్ ఏంటంటే.. ఇందులో హృతిక్‌తో పాటు నటిస్తుండటం. దీంతో ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందోనని సినీ ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇకపోతే ఇటీవలే ఎన్టీఆర్ మొదటి షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఎన్నో రూమర్స్ బయటకొచ్చి వైరల్‌గా మారాయి. ఇప్పుడు మరొక క్రేజీ గాసిప్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే..

Advertisement

‘యానిమల్’ మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు వార్ 2లో నటించే అవకాశం వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే త్రిప్తిని ఎన్టీఆర్‌కు జోడీగా తీసుకున్నారా? లేక హృతిక్‌కి జోడీగా తీసుకున్నారా? అనేది ఇంకా తెలియరాలేదు. త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే వార్ 2 మూవీ మేకర్స్ ఇందులో హృతిక్, ఎన్టీఆర్‌ల మధ్య ఓ సూపర్ డూపర్ డ్యాన్స్ నంబర్‌ను సెట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా ప్లాన్ చేయమన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ సాంగ్‌ను అత్యంత గ్రాండ్‌గా చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిబట్టి చూస్తే.. వార్ 2 మూవీ అత్యంత గ్రాండ్‌ లెవెల్లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×