BigTV English

NTR: హృతిక్ రోషన్ ముందు నేను దేనికి పనికి రాను.. ఎన్టీఆర్ వీడియో వైరల్

NTR: హృతిక్ రోషన్  ముందు నేను దేనికి పనికి రాను.. ఎన్టీఆర్ వీడియో వైరల్

NTR:  సాధారణంగా హీరోలకు అభిమానులు ఉంటారు అనేది అందరికీ తెల్సిందే. అభిమాని అనేవాడు లేకపోతే అసలు హీరోకు విలువే ఉండదు. ఇప్పుడంటే మా హీరో గొప్ప.. మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు హీరోలే.. డైరెక్ట్ గా తమ అభిమాన హీరోల పేర్లు కెమెరాల ముందు చెప్పుకొచ్చేవారు. అంతేనా వారితో పోల్చుకుంటే తాము దేనికి పనికి రాము అని ఒప్పుకొనేవారు. అలా చెప్పినవారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.


నందమూరి నట వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా తరువాత  ఎన్టీఆర్.. బాలీవుడ్  పై ఫోకస్ చేశాడు. హిందీలో  తన మార్కెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగానే  దేవర సినిమా తరువాత బాలీవుడ్ లో వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్  హీరోగా నటిస్తుండగా.. మరో హీరోగా తారక్ నటిస్తున్నాడు.

ఇప్పటికే 2019 లో వచ్చిన వార్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 ను తెరకెక్కిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ లో ఇది 6 వ చిత్రం కావడం విశేషం. వార్ లో హృతిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ కనిపించగా.. వార్ 2 లో టైగర్ ప్లేస్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  పోస్టర్స్, లీక్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Rashmika Mandanna: ఇప్పుడు సంతోషంగా రిటైర్ అయిపోతా.. అదేంటి రష్మిక అంత మాట అనేసింది.?

ఇక మొదటి నుంచి కూడా వార్ 2 లో ఎన్టీఆర్ పాత్రపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సాంగ్స్ లో అయినా ఫైట్స్ లో అయినా హృతిక్ ముందు ఎన్టీఆర్ కనిపించడు అని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆరే స్వయంగా హృతిక్ ముందు తాను నథింగ్ అని ఒప్పుకున్నాడు. అవునా.. నిజామా.. ? ఇదెప్పుడు జరిగింది  అంటే. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అప్పట్లో రమ్యకృష్ణ హోస్ట్ గా ఒక టాక్ షో చేసింది. ఈ టాక్ షోకు ఎన్టీఆర్ గెస్ట్ గా విచ్చేశాడు. అందులో రమ్యకృష్ణ.. ఎన్టీఆరా.. ? హృతిక్ రోషనా.. ? అన్న ప్రశ్నకు ఎన్టీఆర్ తడుముకోకుండా హృతిక్ అని చెప్పుకొచ్చాడు. దానికి రమ్యకృష్ణ ఒప్పుకోకుండా.. నో నో.. నేను ఒప్పుకోను అని అరిచినంత పనిచేసింది. వెంటనే ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ ముందు నేను దేనికి పనికి రాను.. కంపేర్ చేయకండి. ఒప్పుకొని తీరాల్సిందే” అని చెప్పుకొచ్చాడు. పాత వీడియో అయినా కూడా  ఇది  ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వార్ 2 సినిమా రిలీజ్ తరువాత ఈ వీడియో సెన్సేషన్ సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×