POCSO case: కర్నూలు పోక్సో కేసులో జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021 ఆగస్టు 12న తొమ్మిదో తరగతి చదువుతోన్న మైనర్ బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేగాక బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పింది.
వివరాల ప్రకారం.. కర్నూల్, మహవీర్‌నగర్‌లో కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మైనర్ బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్నది. అయితే 2021 ఆగస్టు 12న ఆ బాలికను అదే జిల్లాకు చెందిన గోనెగండ్ల మండలం గజిహళ్లి గ్రామానికి చెందిన షేక్ షావలి(30) అనే కిరాతకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే ఇవాళ నేరం రుజువు కావడంతో నిందితుడి షేక్ షావలికి కఠిన శిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు జడ్జి భూపాల్ రెడ్డి సంచలన తీర్పును వెలువరించారు. నిందితుడు షేక్ షావలికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 10వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆ కుటుంబం ఉద్యోగరీత్యా కర్నూల్‌లో జీవనం కొనసాగిస్తున్నారు.
Also Read: Jobs In UGC: యూజీసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
పోక్సో చట్టం అంటే..?
పోక్సో చట్టం అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం. బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012ను 2012 నవంబరు 14 నుండి అమలులోకి తెచ్చారు. భారతదేశంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని ఆమోదించింది. చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కూడా నవంబరు 2012లో నోటిఫై చేయడంతో చట్టం అమలుకు నోచుకుంది.