Bigg Boss Kannada 11 : బిగ్ బాస్ తెలుగు సీజన్ – 8 సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. తెలుగులో ఈ సీజన్ చివరి వరకూ ఆసక్తికరంగా సాగగా, నిఖిల్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి ఇంట్రెస్టింగ్ మూమెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ కన్నడ 11’ (Bigg Boss Kannada 11) వీక్షకులకు, నిర్వాహకులకు తాజాగా లీక్ రాయుళ్ళు షాకు ఇచ్చారు. గ్రాండ్ ఫినాలే సమీపిస్తున్న తరుణంలో విన్నర్ పేరును ప్రకటిస్తూ చేసిన ఈ కొత్త లీక్ సోషల్ మీడియాలో పెను తుఫానుగా మారింది.
‘బిగ్ బాస్ కన్నడ సీజన 11’ విన్నర్ పేరు లీక్
‘బిగ్ బాస్ కన్నడ 11’ (Bigg Boss Kannada 11) వికీపీడియా పేజీని ఎవరో ఎడిట్ చేసి, ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే విషయాన్ని బయట పెట్టారు. అందులో ఈ సీజన్‌లో మోక్షిత పాయ్ విజేతగా నిలుస్తారని, హనుమంత రన్నరప్‌గా నిలిచారని పేర్కొన్నారు. అలా ఎడిట్ చేసిన క్షణాల్లోనే ఆ వికీపీడియా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ వికీపీడియాలో ఉండే సమాచారం కొన్నిసార్లు తప్పు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ లీక్ పై ఇప్పటిదాకా ‘బిగ్ బాస్ సీజన్ 11’ నిర్వాహకులు స్పందించలేదు.
గ్రాండ్ ఫినాలే పైనే అందరి దృష్టి
జనవరి 26, ఆదివారం జరగనున్న ‘బిగ్ బాస్ కన్నడ 11’ (Bigg Boss Kannada 11) గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ కిచ్చా సుదీప్ విన్నర్, రన్నర్ లను ప్రకటిస్తారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో పాటు పలువురు ప్రత్యేక అతిథుల స్పెషల్ పర్ఫార్మెన్స్ తో ఫినాలేను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.
టైటిల్ రేసులో త్రివిక్రమ్, మంజు, రజత్, మోక్షిత, భవ్య, హనుమంత వంటి టాప్ సిక్స్ ఫైనాలిస్ట్ లు ఉండగా, ఈసారి బిగ్ బాస్ ట్రోఫీని ఎవరు కైవసం చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిలో ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఉండగా, మరో నలుగురు 110 రోజులకు పైగా కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఫైనల్‌కి ముందు మిడ్ వీక్ ఎవిక్షన్ జరగవచ్చని పుకార్లు విన్పిస్తున్నాయి.
కిచ్చా సుదీప్ కు ఆఖరి సీజన్
ప్రస్తుతం ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 11’ (Bigg Boss Kannada 11)కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. నిజానికి షో మొదలు పెట్టినప్పటి నుంచీ ఆయనే హోస్ట్ గా ‘బిగ్ బాస్’ను నడిపిస్తున్నారు. ఇప్పుడు 11 వ సీజన్ నడుస్తుండగా, చివరి దశకు చేరుకుంది. అయితే తాను హోస్ట్ గా ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 11’ చివరి సీజన్ అవుతుందని ఇప్పటికే సుదీప్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన దీని గురించి స్పెషల్ గా ఓ ఎమోషనల్ నోట్ పంచుకున్న సంగతి తెలిసిందే.
ఆ నోట్ లో “బిగ్ బాస్ షోను నేను గత 11 సీజన్‌ల నుండి ఆనందిస్తున్నాను. మీరు చూపిన ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. హోస్ట్‌గా ఇదే నా చివరి సీజన్. మీ అందరినీ అలరించడానికి నా బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది మరపురాని ప్రయాణం. ఈ ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని సుదీప్ రాసుకొచ్చారు.